శ్రీకాకుళం-పార్వతీపురం బస్సు ప్రారంభం
Ens Balu
5
Srikakulam
2022-04-25 06:58:58
ప్రయాణికుల సౌకర్యార్థం సోమవారం నుంచి పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రానికి ఎక్స్ప్రెస్ సర్వీసులు అందుబాటులోకి తెచ్చినట్లు శ్రీకాకుళం ఆర్.టి.సి రెండవ డిపో మేనేజర్ టి.కవిత తెలిపారు. సోమవారం ఉదయం బస్ సర్వీస్ ప్రారంభించిన అనంతరం మేనేజర్ మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ సూచనల, ప్రయాణికుల వినతులు మేరకు రోజు ఉదయం 7.00 గంటలకు బయలు దేరి, 9.30 చేరుకుంటుందని అలాగే పార్వతీపురం నుండి సాయంత్రం 6.00 గంటలకు బయలుదేరి శ్రీకాకుళం 8.30 చేరుకుంటుందని పార్వతీపురం మన్యం జిల్లాగా అవతరించడం తో అక్కడకు వివిధ పనులపై వెళ్లి ఉద్యోగులకు, ప్రజలకు ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు.