తక్షణమే వికలాంగ పించను మంజూరు


Ens Balu
3
Anakapalle
2022-04-25 08:48:28

అనకాపల్లి జిల్లా కలెక్టరేట్ లో  సోమవారం జరిగిన స్పందన కార్యక్రమం లో జిల్లా కలెక్టర్ రవి సుభాష్ పటంశెట్టి, జాయింట్ కలెక్టర్ కల్పనా కుమార  ఫేషియల్, డి ఆర్ ఓ పి వెంకట రమణ ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు. జిల్లా నలుమూలల నుండి ప్రజలు వచ్చి స్పందనలో తమ సమస్యలను తెలియజేస్తూ దరఖాస్తులు సమర్పించుకున్నారు. దేవరాపల్లి మండలం వాలాబు గ్రామానికి చెందిన టి. హేమలత మెక్సికా ఫేషియల్ వ్యాధితో చికిత్స పొందుతూ సహాయం కోసం   తల్లిదండ్రులతో కలసి వచ్చి స్పందన లో దరఖాస్తు చేసుకున్నారు.  దీనిపై జిల్లా కలెక్టర్ వెంటనే స్పందించి జిల్లా స్త్రీ శిశు సంక్షేమ అధికారి సీతామహాలక్ష్మిని పిలచి వివరాలను తెలుసుకుని సహాయం చేయాల్సిందిగా ఆదేశించారు.  బాలికకు వెంటనే వికలాంగ పింఛను మంజూరు చేయవలసిందిగా డీ ఆర్ డి ఎ ఏపీడిని ఆదేశించారు. ఆరోగ్యశ్రీ పథకంలో చికిత్స చేయించాల్సిందిగా ఆరోగ్యశ్రీ కోఆర్డినేటర్ ను ఆదేశించారు.  తక్షణ సహాయం అందించిన కలెక్టర్ కు బాలిక తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు.