కాకినాడ పోలీసు స్పందనకి 47 ఫిర్యాదులు


Ens Balu
9
Kakinada
2022-04-25 09:06:31

కాకినాడ జిల్లా పోలీస్ స్పందన ద్వారా వచ్చిన ఫిర్యాదులను తక్షణమే పరిష్కరించి బాధితులకు న్యాయం చేసే విధంగా చర్యలుతీసుకోవాలని జిల్లా ఎస్పీ ఎం.రవీంధ్రనాధ్ బాబు పోలీసు అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా ఎస్పీ కార్యాలయంలో నిర్వహించిన స్పందన కార్యక్రమం ద్వారా 47 మంది నుంచి వినతులు స్వీకరించారు. అర్జీదారులతో ముఖాముఖి మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకొని, వారి సమస్యలను క్షుణ్ణంగా పరిశీలించారు. కుటుంబ కలహాలు, భర్త/అత్తారింటి వేధింపులు, భూ వివాదాలు మరియు ఇతర సమస్యలపై ఫిర్యాదుదారులు ఎస్పీ ముందు స్వేచ్ఛగా విన్నవించుకోగా, వారి యొక్క సమస్యలపై ఎస్పీ సానుకూలంగా స్పందించారు. ఆపై సంబంధిత పోలీసు అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడి బాధితులకు చట్ట పరిధిలో తక్షణ న్యాయం అందించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీచేశారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ కరణం కుమార్ తదితరులు పాల్గొన్నారు.