విజయనగరం కలెక్టరేట్ లో సోమవారం నిర్వహించిన స్పందనకు ప్రజల నుండి 129 వినతులు అందాయి. వీటిలో పించన్లు, సదరం కోసం వైద్య శాఖకు 28, డి.ఆర్.డి.ఏ కు 6 వినతులు అందగా రెవిన్యూ కు సంబంధించి 95వినతులు అందాయి. ముఖ్యంగా సదరం, పింఛన్లు, ఇళ్ల స్థలాలు,రీ సర్వే, గృహాల కోసం విజ్ఞప్తులు వచ్చాయి. ఈ వినతులు జిల్లా కలెక్టరు ఎ. సూర్య కుమారి, సంయుక్త కలెక్టర్ మయూర్ అశోక్, డి.ఆర్.ఓ గణపతి రావు ఉప కలెక్టర్ సూర్యనారాయణ స్వీకరించారు. అనంతరం అధికారులతో కలెక్టర్ మాట్లాడుతూ నిర్దేశిత గడువు దాటి ఉన్న వినతుల పై ఆయా అధికారులు దృష్టి పెట్టి వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. ఏ ఒక్క శాఖ వద్ద ఏ ఒక్క స్పందన దరఖాస్తు గడువు దాటి ఉన్నా సహించేసి లేదని స్పష్టం చేశారు.