రోజుకి లక్ష పనిదినాల ఉపాధి పనులు


Ens Balu
9
Paderu
2022-04-26 12:52:01

ప్రతి జిల్లాలోను జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో రోజుకు లక్ష పనిదినాలు కల్పిం చాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వై ఎస్ జగన్మోహన్ రెడ్డి స్పష్టం చేసారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుండి జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, జిల్లా అధికారులతో మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, డిజిటల్ లైబ్రరీలు, హెల్త్ క్లీనిక్‌లు గృహ నిర్మాణం, జగనన్న సంపూర్ణ గృహ హక్కు, జగనన్న భూ హక్కు, ప్రాజెక్టులకు భూ సేకరణ, నాడు నేడు , స్పందన ఫిర్యాదుల పరిష్కారంపై అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉపాధి హామీ పనులలో జిల్లాలో రోజుకు లక్ష పనిదినాలు కల్పించాలని, నెలకు 25 లక్షల పనిదినాలు కల్పించాలని లక్ష్యంగా నిర్ధేశించారు. ఏప్రిల్, మే నెలలో ముమ్మరంగా ఉపాధి పనులు జరగాలన్నారు. ఈ మూడు నెలలో పనులపై కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు, డ్వమా పిడిలు, ఎంపిడి ఓలు దృష్టి పెట్టాలని చెప్పారు. రైతు భరోసా కేంద్రాలు, హెల్త్ క్లీనిక్‌లు ఈ ఏడాది సెప్టెంబరు 30 నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్ధేశించారు. డిజిటల్ లైబ్రరీలు డిసెంబరు 31 నాటికి పూర్తి చేయాలని ఆదేశించారు. మొదటి దశ మన బడి నాడు నేడు కింద రూ.3800 కోట్ల తో 15,750 పాఠశాలలను అభివృద్థి చేసామన్నారు. రెండవ దశలో రూ.8 వేల కోట్లతో 26,451 పాఠశాలలను అభివృధ్ధి చేస్తామని మే 2 వ తేదీ నుండి పనులకు శంకుస్థాపనులు చేస్తామన్నారు. పాఠశాల కమిటీలు నాడు నేడు పనులు చేస్తాయని, కలెక్టర్లు,జాయింట్ కలెక్టర్లు, డి ఇ ఓ లు పనులు తనిఖీ చేయాలని అన్నారు. కంపెనీల నుండి సిమెంటు సరఫరా ఇబ్బందులు నోడల్ అధికారిని నియమించి ప్రభుత్వ ప్రాధాన్యతా భవనాల నిర్మాణాలకు ఇసుక,సిమెంటు, ఇనుము, మెటల్ సరఫరా బాధ్యతలు అప్పంగించాలని అన్నారు. భవన నిర్మానాణాల పనులన్సీ ఒకరికే అప్పగించకుండా ఎక్కువ మందికి అప్పగిస్తే పనులు వేగంగా జరుగుతాయన్నారు. తొలిదశలో 15.6లక్షల ఇళ్ల నిర్మాణాలు లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు. ఈనెల 28 వతేదీన విశాఖపట్నంలో 1.32 లక్షల మందికి ఇళ్ల పట్టాలు పంపిణీ చేస్తామన్నారు. స్పందన ఫిర్యాదలు పరిష్కారంలో నాణ్యతలు పాటించాలని చెప్పారు. ఫిర్యాదులను ఎందుకు తిరస్కరించారో ఫిర్యాదుదారులకు తెలియ జేయాలన్నారు.ప్రాధమిక ఆరోగ్యకేంద్రాల నాడు నేడు పనులను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, ఐటిడి ఏ పి ఓ రోణంకి గోపాల క్రిష్ణ , జిల్లా ఎస్పీ సతీష్ కుమార్, డి ఇ ఓ డా.పి.రమేష్, గిరిజన సంక్షేమశాఖ డిడి , సి . ఎ. మణికుమార్, ఇ ఇ డివి ఆర్ ఎం రాజు,రహదారులు భవనాల శాఖ ఇ ఇ పి. బాల సుందర బాబు, ఆర్ డబ్లూ ఎస్ ఇ ఇ జవహార్ కుమార్, ఉపాది హామీ ఎపిడి జె.గిరిబాబు, వెలుగు ఎపిడి మురళి, గృహనిర్మాణ శాఖ ఇ ఇ ఎస్ రఘుభూషణ రావు తదితరులు పాల్గొన్నారు.