గృహ నిర్మాణాలు వేగవంతం కావాలి
Ens Balu
9
Parvathipuram
2022-04-26 12:56:21
రాష్ట్రంలో పేదలకు నిర్మిస్తున్న గృహ నిర్మాణాలను వేగవంతం చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కలెక్టర్ లను ఆదేశించారు. మంగళవారం తాడేపల్లి ముఖ్య మంత్రి క్యాంపు కార్యాలయం నుంచి జిల్లా కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్ లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ సచివాలయ ,రైతు భరోసా కేంద్రాల భవనాలు, వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్స్ , ఏఎంసియు & బిఎంసియు, వైయస్సార్ డిజిటల్ లైబ్రరీలు, జగనన్న గృహ నిర్మాణాలు, జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం, 90 రోజుల ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం, జగనన్న భూ హక్కు- భూ రక్ష, భూసేకరణ, నాడు - నేడు పనులు, హెల్త్, ఎడ్యుకేషన్, స్పందన గ్రీవెన్స్, తదితర అంశాలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్య మంత్రి మాట్లాడుతూ ప్రభుత్వ ప్రాధాన్య అంశాలైన వాటిపై పీరియాడికల్ గా సమీక్షలు నిర్వహించి పనులను పర్యవేక్షించాలని సూచించారు. జగనన్న కాలనీ పెద్ద లే అవుట్ ల పై ప్రత్యేక దృష్టి సారించి అప్రోచ్ రోడ్లు, మౌలిక వసతులు కల్పించి నిర్మాణ పనులు వేగవంతం చేయాలని అన్నారు. జగనన్న సంపూర్ణ గృహ పథకం కింద పెండింగ్ రిజిస్ట్రేషన్ లను పూర్తి చేయాలని అన్నారు. ప్రజల నుండి స్పందనకు వచ్చిన వినతులను నాణ్యమైన పరిష్కారం చూపాలని సూచించారు. విజయనగరం జిల్లా నుండి జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ హాజరుకాగా, స్థానిక కలెక్టర్ కార్యాలయం నుండి జాయింట్ కలెక్టర్ ఓ.ఆనంద్, డి అర్ ఓ జల్లేపల్లి వెంకట రావు, తదితరులు పాల్గొన్నారు.