శాస్వత లైసెన్సులు చేయించుకోవాలి..
Ens Balu
3
Srikakulam
2022-04-26 13:02:49
శ్రీకాకుళం జిల్లాలో మోటారు వాహనాల లెర్నర్ లైసెన్సులు పొంది నేటివరకు శాస్వత లైసెన్సులు పొందని వారందరూ త్వరితగతిన శాస్వత లైసెన్సులను పొందాలని ఉప రవాణా కమీషనర్ డా. వడ్డి సుందర్ పేర్కొన్నారు. ఈ మేరకు మంగళవారం ఆయన ఒక ప్రకటన జారీచేసారు. రాష్ట్ర రవాణా శాఖ కమీషనర్ ఆదేశాల మేరకు త్వరలో రాష్ట్ర రవాణా శాఖ కార్యకలాపాలన్ని కేంద్ర రవాణా మంత్రిత్వ శాఖ ప్రతిపాదిత ఎన్.ఐ.సి ద్వారా నిర్వహించ బడుచున్న VAHAN మరియు SARATHI సేవలకు అనుసంధానించబడనున్నట్లు చెప్పారు. అందువలన ఎవరైతే లెర్నర్ లైసెన్సులను పొంది ఇప్పటివరకు శాస్వత లైసెన్సులను పొందకుండా ఉన్నారో వారందరూ త్వరితగతిన శాస్వత లైసెన్సులను పొందాలని కోరారు. లేనిఎడల సదరు LLR లన్నీ రద్దుకాబడతాయని, కావున దరఖాస్తుదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన ఆ ప్రకటనలో కోరారు.