ప్రజలకు ఈ-గవర్నెస్ చేరువచేయాలి


Ens Balu
4
Rajahmundry
2022-04-26 13:15:51

ప్రజలకు మరింత చేరువగా పారదర్శకంగా ఈ గవర్నెస్ ద్వారా మరింత మెరుగైన సేవలందించడమే ప్రభుత్వ లక్ష్యమని,  ఆ ఉద్దేశ్యాన్ని అందరూ గుర్తుంచుకోవాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం జిల్లా యంత్రాంగంతో ముఖ్యమంత్రి  తాడేపల్లి సిఎం క్యాంపు కార్యాలయం నుంచి హౌసింగ్, ఓటీఎస్ , జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం, గ్రామ, వార్డు, అర్భికే, హెల్త్ క్లినిక్స్, మిల్క్ యూనిట్ భవనాలు,  స్పందన, జగనన్న కాలనీలు, ఉపాధి హామీ, నాడు నేడు స్కూల్స్, ఆసుపత్రులు, అంశాలపై సమీక్షించారు. స్థానిక జిల్లా కలెక్టరేట్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్ డా.కె.మాధవిలత  పాల్గొన్నారు.  వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా కలెక్టర్లు, ఇతర అధికారు లను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ,  రాష్ట్ర ప్రభుత్వం 26 జిల్లాలు  ఎందుకు చేసింది అన్న విషయంలో కలెక్టర్లు, జేసిలు, ఎస్పీలు అవగాహన కలిగి ఉండాలన్నారు. చిన్న జిల్లాలు ఏర్పాటు చేసి, పరిపాలన వికేంద్రీకరణ ద్వారా ప్రజలకు మరింతగా మెరుగైన, త్వరితగతిన పరిపాలన సౌలభ్యం అందించాలన్నదే ఉద్దేశ్యం అన్నారు. ఆ విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తించుకొని, లక్ష్యాలను ఛేదించే దిశగా అడుగులు వేయాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పేదలందరికి గృహాల ను నిర్మించే కార్యక్రమం అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తుందని, దాదాపురూ.13 వేల కోట్లు ఈ పథకం కొరకు ఖర్చు పెడుతున్నామని తెలిపారు. జిల్లా కలక్టర్ వీడియో కాన్ఫరెన్స్ అనంతరం అధికారులతో సమీక్ష చేస్తూ, ప్రభుత్వం నిర్దేశించిన ప్రాధాన్యత కార్యక్రమాలు నూరు శాతం సాధించేలా కార్యాచరణ ప్రణాళికను అమలు చేయాలన్నారు. ప్రతి 15 రోజులకు సిఎం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్న దృష్ట్యా ప్రగతి సాధించేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు.  ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ సిహెచ్. శ్రీధర్, మునిసిపల్ కమిషనర్ కె.దినేష్ కుమార్, డి ఆర్ ఓ బి. సుబ్బారావు,  ఎస్ ఈ.(పిఆర్)  ఏ బివి ప్రసాద్, డి ఎమ్ & హెచ్ ఓ డా. ఆర్ స్వర్ణలత, డిటి సి ఓ డా. ఎన్. వసుంధర, డి ఎస్ సి ఓ . పి. లక్ష్మణ రావు,  డిప్యూటీ డి ఎమ్ & హెచ్ ఓ లు   డా. కె. సుధాకర్, డా. జీ. వరలక్ష్మి, డ్వామా అడిషనల్ పిడి  ఏ. మోక్షలింగం, డిఎఓ(అగ్రి) ఎస్ . మాధవరావు, డిపిఆర్వో ఐ. కాశయ్య ఇతర అధికారులు పాల్గొన్నారు.