విజయవాడ ఘటనను ప్రతీఒక్కరూ ఖండించాలి


Ens Balu
11
Rajahmundry
2022-04-26 13:19:50

విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో మానసిక పరిస్థితి సరిగ్గా లేని మహిళపై జరిగిన ఆ ఘటన ప్రతి ఒక్కరూ ఖండించాలని, ఆ సంఘటన ద్వారా  రాజకీయంగా  ప్రయోజనం కోసం ప్రతిపక్షాలు ఆరాటపడడం సహేతుకం కాదని రాష్ట్ర హోం మంత్రి డా. తానేటి వనిత పేర్కొన్నారు. మంగళవారం స్థానిక ఆర్ అండ్ బి అతిధి గృహంలో ఎంపి మార్గాని భరత్ రామ్ తో కలిసి మీడియా సమావేశంలో మంత్రి పాల్గొన్నారు.  ఈ సందర్భంగా మంత్రి డా. తానేటి వనిత  మాట్లాడుతూ, విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో మానసిక పరిస్థితి సరిగ్గా లేని మహిళపై జరిగిన ఘటన ను ఎవ్వరూ హర్షించరని పేర్కొన్నారు. అటువంటివి సమాజంలో జరగ కూడదన్నారు. ఆ సంఘటన లోని బాధిత కుటుంబాల, బాధితురాలి వివరాలు బహిర్గతం చెయ్యరాదని చట్టాలు స్పష్టంగా తెలియ చేస్తున్నాయన్నారు. ప్రతిపక్ష నేత మీడియా తో కలిసి ప్రచారం కోసం చర్యను ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు. కొందరు ప్రతి పక్ష నాయకులకు మహిళలపై ఏమాత్రం గౌరవం లేదని మంత్రి తెలిపారు. అత్యాచార బాధితురాలి పరామర్శను కూడా ప్రతిపక్ష నాయకుడు రాజకీయం చేశారన్నారు. పోలీసు శాఖ మూడు గంటల్లోనే అత్యాచార నిందితులను పట్టుకోవడం జరిగిందన్నారు. అంతే కాదు బాధితురాలికి ప్రభుత్వం తరుపున 10 లక్షల రూపాయల పరిహారం ఇచ్చాము. ఆ కుటుంబంలో ని బాధిత రాలికి, లేదా ఆమె తల్లికీ ఉద్యోగం కోసం సిఫార్సు చేసినట్లు తెలిపారు. స్వంత ఇంటిని , స్థలాన్ని ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నామని, గృహ నిర్మాణ శాఖ మంత్రి తో ఈ విషయం పై మాట్లాడినట్లు తెలిపారు. హోం మంత్రి గా ఉన్న నన్ను ట్రోల్ చేయడం మహిళలకు ఇచ్చే  గౌరవమా..? అని ప్రశ్నించారు. మహిళా కమిషన్ ఛైర్మన్ తో ప్రతిపక్షా లకు చెందిన మహిళలు , వర్గాలు అడ్డు తగలడం   కొట్లాటాలా వ్యవహరించి, మహిళలు పట్ల వారి కున్న వైఖరిని తేటతెల్లం చేస్తున్నాయన్నారు. ఎమ్మార్వో వనజాక్షి విషయంలో అప్పటి సీఎం హోదాలో చేసిన  పంచాయతీని మంత్రి ఒకసారి గుర్తు చేశారు. మహిళలంతా సీఎం జగన్ వెనక ఉండటాన్ని ప్రతిపక్షం తట్టుకోలేక పోతోంది. సర్వేల ఫలితాలు తెలుసుకుని, అధికారం రాదని తెలుసుకుని ప్రతిపక్షాలు రచ్చ చేస్తున్నాయన్నారు. ప్రతి అంశాన్ని ప్రతిపక్షాలు రాజకీయం చేయడానికి ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు. గత ప్రభుత్వంలో  మహిళలపై దారుణాలు జరిగితే బయటకు వచ్చేవి కాదని.. మా ప్రభుత్వంపై  నమ్మకంతో బాధితులు  బయటకు వస్తున్నారు. దిశ యాప్ ద్వారా చాలా మంది మహిళలు తమని తాము రక్షించుకున్న ఘటనలు మంత్రి ప్రస్తావించారు. హక్కుల కోసం పోరాడటాన్ని  ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు కూడా హర్షిస్తారని తెలిపారు. ఐతే ఇక్కడ జరిగింది ,సీఎం క్యాంప్ ఆఫీస్ ముట్టడికి యు.టి.ఎఫ్  యత్నించడం అని, ఇది ఎంతవరకు సరైనదని ఆలోచించుకోవాలి.రాష్ట్ర ప్రజలందరూ సీఎం జగన్ గారి పాలనపై పూర్తి నమ్మకంతో వున్నారు. ప్రజల నుండి వస్తున్న ఆదరణ చూసి తట్టుకోలేకనే ప్రతిపక్షాలు నాయకులు విషప్రచారం చేస్తున్నారన్నారు. రాష్ట్రంలో జరిగే ప్రతి విషయాన్ని రాజకీయ లబ్దికోసం ఉపయోగించు కోవాలని కొందరు చూస్తున్నారన్నారు.

ఆంధ్రరాష్ట్ర ప్రజలందరూ  రాష్ట్రంలో జరుగుతున్న ప్రతివిషయాన్ని గమనిస్తున్నారని, ప్రభుత్వంపై అన్యాయంగా చేస్తున్న విష ప్రచారాలను గమనిస్తూనే వున్నారని , తగిన సమయంలో గుణపాఠం చెబుతారని తెలిపారు. ఇప్పటికైనా ప్రతిపక్షాలు, కొందరు నాయకులు అసత్య ఆరోపణలు చేయడం మానుకోవాలని హితవు పలికారు. ఎంపి మార్గని భరత్ మాట్లాడుతూ, దిశా చట్టానికి కేంద్ర మహిళా మంత్రిత్వ శాఖ సానుకూలంగా స్పందించి, తదుపరి చర్య కోసం హోం మంత్రిత్వ శాఖ కు సిఫార్సు చేసిందని తెలిపారు.  తదుపరి పార్లమెంట్ లో కూడా తదుపరి సానుకూల నిర్ణయం రావడం దిశగా అడుగులు ముందుకు పడుతున్నట్లు తెలిపారు.