కార్పోరేషన్ ఆధ్వర్యంలో చలి వేంద్రాలు


Ens Balu
4
Kakinada
2022-04-26 13:24:23

ప్రస్తుత వేసవిలో ప్రజల దాహార్తిని తీర్చేందుకు కాకినాడ నగరపాలక సంస్థ  రద్దీగా ఉండే  16 ప్రాంతాలలో చలివేంద్రాలు ఏర్పాటు చేసింది. రూ 3 లక్షలు వెచ్చించి చలివేంద్రాల ఏర్పాటుకు అవసరమైన వసతులు కల్పించారు. నగరపాలక సంస్థ ద్వారా  స్వచ్ఛమైన చల్లటి నీటితో  ఈ చలివేంద్రాలు ద్వారా  ప్రజల దాహార్తిని తీర్చనున్నారు. ప్రతిరోజు ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకూ నగరపాలక సంస్థ చలివేంద్రాలు ద్వారా మంచినీటి అందించి ప్రజల దాహార్తిని తీర్చనున్నారు. కేవలం మంచి నీరే కాకుండా  భానుగుడి జంక్షన్, టౌన్ హాల్, ప్రభుత్వాసుపత్రి, జగన్నాధపురం వెంకటేశ్వర స్వామి టెంపుల్, అన్నమ్మ ఘాటీ సెంటర్ వంటి ముఖ్యమైన 5 ప్రాంతాలలో మజ్జిగ చలివేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. ఈ మజ్జిగ చలివేంద్రాలు  మధ్యాహ్నం 12 గంటల నుంచి 3 గంటల వరకు  పని చేయనున్నాయి. చలి వేంద్రాలు ఏర్పాటు, నిర్వహణకు సంబంధించి  నగరపాలక సంస్థ కమిషనర్ సిహెచ్ నాగ నరసింహారావు ఎస్ ఈ సత్య కుమారి,  ఇంజనీరింగ్ అధికారులతో మంగళవారం సమీక్షించారు. ఏర్పాటు  చేసిన చలివేంద్రాల లో  ఎటువంటి నీటి  సమస్య ఎదురు కాకుండా చర్యలు తీసుకోవాలని  సూచించారు. ఈ మేరకు ఆయా చలివేంద్రాలను   పర్యవేక్షించే సిబ్బందికి స్పష్టమైన ఆదేశాలు ఇవ్వాలని కమిషనర్ నాగ నరసింహారావు కోరారు.