అభివ్రుద్ధి పనులు వేగవంతం చేయాలి..


Ens Balu
7
Kakinada
2022-04-26 13:27:19

అభివృద్ధి పనులు వేగవంతం చేయాలని కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ సిహెచ్ నాగ నరసింహారావు ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. నగరపాలక సంస్థ  కార్యాలయం లోని సమావేశ మందిరంలో మంగళవారం 14,15 ఆర్థిక సంఘ నిధులు, రహదారుల మరమ్మతులు, కార్పొరేషన్ సాధారణ నిధులు. అర్బన్ హెల్త్ సెంటర్ల అభివృద్ధి, నాడు- నేడు, పూడికతీత పనులు, మంచినీటి పై వేసవి కార్యాచరణ, తదితర అంశాలపై ఇంజనీరింగ్ అధికారులతో సమీక్షించారు. పనుల ప్రగతిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం  కమిషనర్ నాగ  నరసింహారావు మాట్లాడుతూ వివిధ దశల్లో ఉన్న పనులన్నీ  వేగవంతంగా పూర్తి చేయాలని ఆదేశించారు. కాకినాడ రూరల్ సిటీ ఎమ్మెల్యేలు కన్నబాబు, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి. మేయర్ సుంకర శివ ప్రసన్న, కార్పొరేటర్లు వివిధ అభివృద్ధి పనులను ప్రతిపాదించారని కమిషనర్ చెప్పారు. ప్రతిపాదిత పనులన్నీ సకాలంలో వేగవంతంగా పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. మార్చి చివరినాటికి కాంట్రాక్టర్లకు సంబంధించిన వే బిల్లులు కూడా క్లియర్ అయ్యాయని కమిషనర్ చెప్పారు.  సమావేశంలో  ఎస్ ఈ సత్య కుమారి, ఈఈ లు డిఈ లు, ఏఈలు పాల్గొన్నారు. 

 నగరంలోని ట్రాఫిక్ సమస్యలపై ట్రాఫిక్ డిఎస్పి  మురళి కృష్ణారెడ్డి,సి ఐ చైతన్య కృష్ణ,  ఇంజనీరింగ్ అధికారులతో కమిషనర్ నాగ నరసింహారావు సమావేశమయ్యారు. ట్రాఫిక్ సిగ్నల్స్, స్పీడ్ బ్రేకర్లు, సెల్లార్ పార్కింగ్, ట్రాఫిక్ అవరోధంగా ఉన్న పశువుల సమస్య, సిగ్నల్ లైట్లు, సైన్ బోర్డ్స్ వంటి  అంశాల పై  చర్చించారు. అనంతరం కమిషనర్ మాట్లాడుతూ ట్రాఫిక్ క్రమబద్ధీకరణ లో నగరపాలక సంస్థ ను కూడా భాగస్వామ్యం చేసి ప్రజలకు మరింత సౌకర్యవంతంగా ఉండేలా చూస్తామన్నారు.