ఉత్తరాంధ్రలో కవులు, కళాకారులు, రచయితలు, నటులకు కొదవలేదని, అన్నింటికి ఈ ప్రాంతం పుట్టినిల్లుగా బాసిల్లుతుందని సురక్ష ఆసుపత్రి అధినేత, జనసేన డాక్టర్స్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ బొడ్డేపల్లి రఘు అన్నారు. నగరానికి చెందిన ధనుంజయ్ ఆర్ట్స్, క్రాప్ట్స్ సంస్థ 25వ వార్షికోత్సవ వేడుకలు విశాఖ పౌరగ్రంథాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రఘుతో పాటు అప్పన్న ధర్మకర్తల మండలి సభ్యులు గంట్ల శ్రీనుబాబు, ప్రముఖ మెజిషియన్ బి.ఎన్. రెడ్డి, స్నేహాంజలి సంస్థ అధ్యక్షులు మూర్తి, కళాకారులు నాంచారయ్య, వెంకటేశ్వరరావు, నటుడు యాద్ కుమార్, సత్గీత్ క్రియేషన్స్ అధినేత గణేష్ తదితరులు పాల్గొని ధనుంజయ్ సేవలను కొనియాడారు. నిరంతరం తాను కష్టించి పనిచేస్తూ మరికొంత మందికి ఉపాది కల్పించి ధనుంజయ్ ఎంతో మందికి ఆదర్శనీయంగా నిలిచారన్నారు. నటుడిగా, కళాకారుడిగా మంచి గుర్తింపు తెచ్చుకోవడం అభినందనీయమన్నారు. వీరంతా నటుడు ధనుంజయ్ ను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో నగరానికి చెందిన పలువురు కళాకారులు, నటులు పాల్గొన్నారు.