ప్రారంభం కాని ఇళ్లన్నీ రద్దైపోతాయ్..


Ens Balu
9
Vizianagaram
2022-04-28 14:46:39

విజయనగరం జిల్లాలో మే నెల 15 నాటికి స్లాబ్ పడని  గృహాలు  రద్దు చేయడం జరుగుతుందని  జిల్లా కలెక్టర్ ఎ. సూర్య కుమారి ఒక ప్రకటనలో తెలిపారు.  కేంద్ర ప్రభుత్వ నిబంధనల మేరకు ఒక సారి రద్దయితే ఆ ఆధార్ పై మళ్లీ మంజూరు అయ్యే అవకాశం లేదని స్పష్టం చేశారు. అందువలన గృహాలు మంజూరైన లబ్ధిదారులు ఈ నెలాఖరు లోగా గ్రౌండింగ్ చేసుకొని, మే 15 నాటికి స్లాబ్ లెవెల్ కు చేరి కనీసం ఒక పేమెంట్ ను  పొందాలన్నారు. గుంకలాం వంటి పెద్ద లే ఔట్ నందు కాంట్రాక్టర్ ను ఏర్పాటు చేయడం జరిగిందని, మెటీరియల్ కూడా సిద్ధంగా ఉందని, మెప్మా వారి సహాయం తో లబ్ధిదారులు గృహ నిర్మాణాలు వెంటనే ప్రారంభించుకోవాలని తెలిపారు. మంజూరైన గృహాలు  రద్దు కాకుండా  వెంటనే నిర్మాణాలు చేపట్టాలన్నారు.