ఆలయాల అభివ్రుద్ధి ప్రభుత్వ ప్రాధాన్యం..


Ens Balu
9
Srikakulam
2022-04-29 11:47:08

రాష్ట్రంలోని దేవాలయాల అభివృద్ధికి ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేస్తుందని ఆంధ్రప్ర దేశ్ శాసన సభాపతి తమ్మినేని సీతారాం అన్నారు. స్థానిక మున్సిపల్ కార్యాలయంలో ఎండోమెంట్ అధికారులతో జరిగిన సమీక్ష సమావేశంలో స్పీకర్ తమ్మినేని మాట్లాడుతూ, ఆమదాలవలసలో శ్రీ సత్యనారాయణ స్వామి దేవాలయంకు 60 లక్షలు, తోగారం గ్రామంలో ఉన్న శ్రీ వల్లభ నారాయణ స్వామి దేవాలయంకి 50 లక్షలు,దివంజిపేట లో ఉన్న శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాలయంకి 50 లక్షలు, కలివరం గ్రామంలో ఉన్న శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాలయంకి 50 లక్షలు, బెల్లమాం గ్రామంలో ఉన్న శివాలయం కి 40 లక్షలు, రామచంద్రపురం గ్రామంలో ఉన్న శ్రీ వల్లభ నారాయణ స్వామి దేవాలయంకి 40 లక్షలు, గాజులకొల్లివలస గ్రామం లో ఉన్న పురాతన దేవాలయం సంగమేశ్వర దేవాలయం కి 30 లక్షలు, బూర్జ మండలం తమ్మీనాయుడుపేట గ్రామంలో ఉన్న విష్ణుమూర్తి దేవాలయంకి 40 లక్షలు చొప్పున ఈ ఎనిమిది దేవాలయాలకు నూతన దేవాలయాలు నిర్మించుకోవడానికి నిధులు మంజూరయ్యాయని స్పీకర్ తమ్మినేని అన్నారు. సభాపతి కృషివలన త్వరితగతిన దేవాలయాలకు నిధులు మంజూరయ్యాయని ఎండోమెంట్ ఏసి కే శిరీష అన్నారు. అదేవిధంగా గ్రామాలలో దేవాలయ కమిటీలు ఏర్పాటు చేసి ఉమ్మడి బ్యాంక్ ఎకౌంటు ఏర్పాటు చేసి ఆ అకౌంట్లో గ్రామ ప్రజల వాటా 20 శాతం డబ్బులు జమ చేయాలన్నారు ప్రభుత్వము నుండి మిగతా 80 శాతం నిధులను ఆ అకౌంట్లో జమ అవుతాయని ఆమె అన్నారు. త్వరితగతిన గ్రామాలలో దేవాలయ కమిటీలను ఏర్పాటు చేయాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో సహకరించిన మాజీ దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ కి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానని స్పీకర్ తమ్మినేని సీతారాం అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ ప్రతినిధి కర్నేనా నాగేశ్వరరావు, జడ్పిటిసి బెజ్జీ పురపు రామారావు, మండల పార్టీ అధ్యక్షులు రాష్ట్ర అవుట్సోర్సింగ్ డైరెక్టర్ ఖండపు గోవిందరావు, మార్కెట్ కమిటీ చైర్మన్ గుమ్మడి రాంబాబు ఎండోమెంట్ ఏ సి కె శిరీష మరియు ఈ ఓ లు పాల్గొన్నారు.