సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉండాలి..


Ens Balu
10
Srikakulam
2022-04-30 06:23:02

గ్రామ వార్డ్ సచివాలయాల సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉండి సత్వర సేవలు అందించేలా విధులు నిర్వహించాలని జిల్లా పరిషత్ సీఈఓ, జిల్లా స్థాయి గ్రామ వార్డు సచివాలయాల నోడల్ అధికారి బి.లక్ష్మి పతి శనివారం పేర్కొన్నారు. గ్రామ వార్డు సచివాలయాల సిబ్బంది పనితీరు పరిశీలించేందుకు మరింత మెరుగు పరిచేలా చర్యలు చేపట్టాలన్న ఉదేశ్యం జిల్లాకు ఒక నోడల్ అధికారిని నియమించినట్టు చెప్పారు. 2022, ఏప్రిల్ 21వ తేదీన నిర్వహించిన వెబ్  కాన్ఫరెన్స్‌లో జిల్లా కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిన మేరకు  శ్రీకాకుళం జిల్లాలో జిల్లా పరిషత్ సి.ఇ.ఓ జిల్లా నోడల్ అధికారిగా నియమిస్తూ జిల్లా కలెక్టర్ శ్రీకేశ్ లాఠకర్ ఆదేశాలు జారీ చేశారు. జిల్లా పరిషత్ సిఈఓ, గ్రామ వార్డ్ సచివాలయం నోడల్ అధికారి లక్ష్మిపతి మాట్లాడుతూ గ్రామ, వార్డ్ సచివాలయంలో సిబ్బంది అందుబాటులో ఉండి ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి పథకాలు అందించేందుకు నిరంతరం విధులు నిర్వహించాలన్నారు. ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ ప్రచారం నిర్వహించాలన్నారు. ప్రభుత్వ అందిస్తున్న సేవలు, ఆధార్ సేవల లభ్యతను ప్రచారం చేయాలన్నారు. గ్రామ వార్డ్ సచివాలయంలో  లామినేషన్ సౌకర్యం అందుబాటులోకి వచ్చాయని వివరించారు. సచివాలయాల ద్వారా ఇసుక బుకింగ్‌లు, అసంఘటిత కార్మికులకు రిజిస్ట్రేషన్లు వేగవంతం అయ్యేలా చూడాలన్నారు

అన్ని గ్రామ/వార్డు సచివాలయాల్లో ఇంటర్నెట్ మానిటరింగ్ టూల్‌ను డౌన్‌లోడ్ చేసి, ఇన్‌స్టాల్ చేయడం జరిగిందన్నారు.  బయో మెట్రిక్ హాజరును రోజుకు మూడుసార్లు తప్పని సరి అన్నారు. ప్రతి రోజూ మధ్యాహ్నం 3 నుండి 5 గంటల మధ్య స్పందన నిర్వహించి వచ్చిన వినతులు సంబంధిత అధికారులకు అందజేయా లన్నారు. సిబ్బంది క్రమశిక్షణతో మెలిగి ప్రజలకు మెరుగైన సేవలు అందించే దిశగా అడుగులు వేయాలన్నారు. అలాగే జగనన్న స్వచ్ఛ సంకల్పంలో అందరూ భాగస్వామ్యులేనని, గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు జగనన్న స్వచ్ఛ సంకల్పంలో భాగస్వాములై చెత్త సేకరణ కార్యక్రమం విజయవంతం చేయాలని కోరారు. గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలో ఉన్న ప్రజలు వారికి కావలసిన సేవల నిమిత్తం మీ పరిధిలో ఉన్న వాలంటీర్ సహాయంతో సేవలు పొందవచ్చునని జడ్పీ సీఈవో లక్ష్మీపతి పేర్కొన్నారు.  ప్రజల సమస్యలను ప్రతి రోజూ మధ్యాహ్నం సచివాలయంలో నిర్వహించే స్పందనలో తమ సమస్యలను పరిష్కరించే నిమిత్తం ఫిర్యాదులు అందజేయాలన్నారు. ప్రజలు గ్రామ, వార్డు వాలంటీర్ సేవలను వియోగించుకొని తమ సమస్యలు పరిష్కరించుకోవాలని ఆయన కోరారు.