అర్హులకు సంక్షేమ పథకాలు చేరువ చేయాలి..


Ens Balu
9
Anantapur
2022-04-30 09:24:08

అర్హులకు సంక్షేమ పథకాలు చేరువ చేయాలని నగర మేయర్ మహమ్మద్ వసీం అధికారు లను ఆదేశించారు. నగరంలోని 48వ డివిజన్ లో శనివారం నిర్వహించిన సిటిజన్ అవుట్ రిచ్ కార్యక్రమంలో మేయర్ వసీం డిప్యూటీ మేయర్ కోగటం విజయభాస్కరరెడ్డి తో కలసి పాల్గొన్నారు.ఈ సందర్భంగా స్థానికులను మేయర్ వసీం సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అదే విధంగా సంక్షేమ పథకాలు అందుతున్నాయా లేదా అని ప్రజలను అరా తీశారు. అర్హులందరికీ సంక్షేమ పథకాలు పార్టీలకతీతంగా కులమతాలకు అతీతంగా అందించాలన్నదే ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి సంకల్పమన్నారు.అంతేకాకుండా సంక్షేమ పథకాలు అమలు తీరును స్వయంగా ప్రజా ప్రతినిధులు అధికారులతో కలసి వెళ్లి పరిశీలించేందుకు సిటిజన్ అవుట్ రిచ్ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందని, అర్వత ఉండి సంక్షేమ పథకాలు అందకుంటే అక్కడికక్కడే వాటిని పరిష్కరించడమే   సిటిజన్ అవుట్ రిచ్ కార్యక్రమం ముఖ్య ఉద్దేశ్యమన్నారు. సచివాలయ సిబ్బంది కూడా ఎప్పటికప్పుడు ప్రజలలో మమేకమై వారి సమస్యలు పరిష్కరించాలని సూచించారు. ఈ సందర్భంగా డివిజన్ పరిధిలో పారిశుద్ధ్య సమస్యలను స్థానికులు మేయర్ దృష్టికి తీసుకురాగా వాటిని పరిష్కరించాలని అధికారులకు సూచించారు. కార్యక్రమంలో అడిషనల్ కమిషనర్ రమణారెడ్డి,కార్పొరేటర్లు  శ్రీనివాసులు, అనిల్ కుమార్ రెడ్డి కమల్ భూషణ్,సెక్రెటరీ సంగం శ్రీనివాసులు, నగర పలువురు అధికారులు, సచివాలయం  సిబ్బంది పాల్గొన్నారు.