పవిత్రతకు మారుపేరు రంజాన్ మాసం..


Ens Balu
5
Anakapalle
2022-05-01 14:03:42

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్. జగన్ మోహన్ రెడ్డి ముస్లింలకు ప్రభుత్వంలో అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారని పరిశ్రమలు ఐటీ శాఖ  మంత్రి గుడివాడ అమర్నాథ్ తెలిపారు. ఆదివారం అనకాపల్లి పట్టణంలోని శారదా నగర్ లో గల కళ్యాణ మండపంలో జిల్లా యంత్రాంగం  ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందు కు ఆయన ముఖ్య అతిథిగా వచ్చారు.  ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ దివంగత రాజశేఖర్ రెడ్డి ముస్లింలకు నాలుగు శాతం రిజర్వేషన్లు కల్పించారని గుర్తుచేశారు. ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి వైయస్సార్ పార్టీ లో నలుగురు ముస్లింలకు ఎమ్మెల్యే లు గా స్థానం కల్పించాలని ఒకరికి ఒక ముఖ్య మంత్రి పదవి కూడా ఇచ్చారని చెప్పారు. మైనారిటీ ప్రయోజనాలకు ప్రభుత్వం అన్ని విధాలుగా చర్యలు చేపడుతుందని తెలిపారు.

అనకాపల్లి పార్లమెంటు సభ్యురాలు డాక్టర్ బి వి సత్యవతి మాట్లాడుతూ  పేదలకు దానాన్ని ఇమ్మని ఖురాన్ బోధిస్తోంది అని, ఇంకా ఎన్నో మంచి విషయాలు కురాన్ లో ఉన్నాయని వాటిని అందరూ ఆదరించాలని పిలుపునిచ్చారు.  సర్వ మత సామరస్యానికి భారతదేశం ఆంధ్ర ప్రదేశ్ ప్రతీకగా నిలుస్తాయి అన్నారు రాష్ట్రంలో జగన్మోహన్రెడ్డి ముస్లింల కోసం అనేక పథకాలను ప్రవేశపెట్టారని తెలిపారు.

జిల్లా కలెక్టర్ రవి పట్టం శెట్టి మాట్లాడుతూ అనకాపల్లి నూతన జిల్లా ఏర్పడిన తరువాత మొట్టమొదటిసారి ఇఫ్తార్ విందులో పాల్గొనడం తనకెంతో సంతోషంగా ఉందన్నారు.  ముస్లిం సంక్షేమానికి ప్రభుత్వం అనేక పథకాలను అమలు చేస్తుందని చెప్పారు.  స్పందన కార్యక్రమం ద్వారా దరఖాస్తు చేసుకుంటే సమస్యలను తక్షణం పరిష్కరిస్తామని తెలిపారు. అనకాపల్లి జామియా మసీదు ప్రెసిడెంట్ పి ఎస్ ఎన్ హుస్సేన్ మాట్లాడుతూ ముస్లింలందరూ స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి కి ఆయన కుమారుడు జగన్మోహన్ రెడ్డికి ఎంతో రుణపడి ఉన్నామని చెప్పారు.  ఇఫ్తార్ విందు ఏర్పాటు చేసిన జిల్లా యంత్రాంగానికి కృతజ్ఞతలు తెలిపారు.

మంత్రి అమర్నాథ్ ఎంపీ సత్యవతి కలెక్టర్ రవి పట్టం శెట్టి లకు అభినందనలు తెలియజేస్తూ ముస్లిం పెద్దలు సత్కరించారు.    ఈ కార్యక్రమం లో  జిల్లా రెవిన్యూ అధికారి పి వెంకట రమణ, ఆర్డీవో చిన్నికృష్ణ, జిలాని  రహమాన్ షరీఫ్ తదితరులు పాల్గొన్నారు‌.