రైతు సమస్యల పరిష్కారానికి పరిశోధన ద్వారా చర్యలు..
Ens Balu
3
Ambajipeta
2020-09-18 14:54:45
కొబ్బరి రైతులకు ఆదాయం పెంచి ఇతర రాష్ట్రాలతో పోటి పడే విధంగా అంబాజీపేట కొబ్బరి పరిశోధన కేంద్రంలో మరిన్ని పరిశోధనలు జరపాలని మంత్రి కన్నబా బు అధికారులను ఆదేశించారు. అంబాజీపేట కొబ్బరి పరిశోధన కేంద్రం ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన వెబినార్ లో పాల్గొన్న వ్యవసాయ శాఖ మంత్రి కురసా ల కన్నబాబు మాట్లడుతూ, 2020-2021 ఏడాదిని డా||వై.యస్.ఆర్.ఉద్యాన విశ్వవిద్యాలయములో కొబ్బరి నామ సంవత్సరంగా ప్రకటన చేయడం కొబ్బరి రైతుల పట్ల ప్రభుత్వానికి ఉన్న బాధ్యతను మరింత పెంచిందన్నారు. రైతు భరోసా కేంద్రాల వద్ద ఉన్న వ్యవసాయ సహయకుల ద్వారా కొబ్బరి రైతుల సమస్యలను తెలుసుకుని పరిష్కాలను చూపాలన్నారు. అంబాజీపేట కొబ్బరి పరిశోధన కేంద్రం 1953 నుంచి కొబ్బరి ఉత్పత్తిపై పరిశోధనలు నిరాటంకంగా చేయడంపై మంత్రి హర్షం వ్యక్తం చేశారు. కొబ్బరి రైతులకు మరింత మేలు చేసేలా శాస్త్రవేత్తలు పరిశోధనలు జరగాలన్నారు. కొబ్బరి ఉత్పత్తితో దేశములో నాల్గవ స్థానములోను, ఉత్పాదకతలో మొదటి స్థానములోనూ ఉందన్న మంత్రి 1955లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, వ్యవసాయశాఖ పరిధిలో కొబ్బరిపై పరిశోధన చేపట్టడానికి, మొట్టమొదటి కొబ్బరి పరిశోధన కేంద్రాన్న 60 ఎకరాల విస్తీర్ణములో ఏర్పాటు చేసిందన్నారు. అనంతరం 1966లో ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ విశ్వవిద్యాలయం యాజమాన్యం పరిధికి బదిలీ అయినదన్నారు. ఇక్కడ చేసిన పరిశోధనల ఫలితముగా గంగా బొండాం రకాన్ని జాతీయ స్థాయిలో 2007 లో 'గౌతమి గంగ' గా విడుదల చేయబడిందన్నారు. కొబ్బరిలో పురుగుల నివారణకు కొబ్బరి వేరు ద్వారా కీటక నాశక మందులను కనిపెట్టిన పద్ధతి, రాష్ట్రములో తొలుతగా ఈ పరిశోధనా స్థానంలోనే గుర్తించారని గుర్తు చేశారు. ఈ వెబినార్ లో హార్టికల్చర్ కమిషనర్ చిరంజీవి చౌదరి, వైయస్సార్ హార్టికల్చర్ విశ్వవిద్యాలయం ఉప కులపతి జానకిరామీరెడ్డి తదితరులు పాల్గొన్నారు.