పేద విద్యార్థుల చదువు బాధ్యత నాది


Ens Balu
5
Paderu
2022-05-05 11:14:15

 పేదరికం వల్ల విద్యార్థుల చదువు మధ్యలో ఆగిపోకూడదు అనే ఆలోచనతో జగనన్న విద్యా దీవెన పథకం ప్రవేశపెట్టి విద్యార్థుల చదువు బాధ్యతను తీసుకున్నానని రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి స్పష్టం చేశారు.  గురువారం తిరుపతి నుండి జగనన్న విద్యా దీవెన పథకం ప్రారంభిస్తూ ప్రతి మూడు నెలలకు విద్యార్థుల ఫీజు ను ఎప్పటికప్పుడు చెల్లిస్తున్నామన్నారు.  ఈ త్రై మాసంలో 10.85 లక్షల మంది విద్యార్థులకు రూ. 709 కోట్ల రూపాయలను బటన్ నొక్కి తల్లుల ఖాతాలలో జమ చేశారు.  ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ సంక్షేమ క్యాలెండర్ ను ముందుగానే ప్రకటించి అందుకు అనుగుణంగా పథకాల లబ్ధి చేకూరుస్తున్నమన్నారు.  జగనన్న విద్యా దీవెన తో పాటు జగనన్న వసతి దీవెన కింద 2021-22 సంవత్సరంలో రెండో విడతగా 1024 వేల కోట్ల రూపాయలు అందజేసిన ఘనత ఈ ప్రభుత్వానిదే అన్నారు. తిరుపతిలో జరిగిన ఈ కార్యక్రమం లైవ్ టెలికాస్ట్ కాగా జిల్లా నుండి జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, గిరిజన సంక్షేమ ఉపసంచాలకులు పి ఎ మణికుమార్, విద్యార్థులు కలెక్టరేట్ సమావేశ మందిరంలో తిలకించారు.