ఉద్యోగులు ఏపీజీఎల్ఐ తీసుకోవాలి..
Ens Balu
2
Visakhapatnam
2022-05-05 14:24:24
ప్రభుత్వ ఉద్యోగులు చెల్లించిన ఎ.పి.జి.ఎల్.ఐ ప్రీమియం మొత్తానికి పాలసీలు తీసుకోవాలని విశాఖ జాయింట్ డైరక్టర్ డి.అశోక్ ఒక ప్రకటనలో తెలిపారు. 55సంవత్సరం లోపు ప్రభుత్వ ఉద్యోగులు ఎ.పి.జి.ఎల్.ఐ ప్రీమియం చెల్లించుచూ పాలసీలు పొందని వారు, 55 సంవత్సరంలు దాటి సర్వీసులో ఉన్న ఉద్యోగులు తేది 30-6-2022 లోగా ప్రతి పాదనలు జిల్లా బీమా కార్యాలయంనకు సమర్పించి పాలసీలను పొందాలని కోరారు. తేది 30-6-2022 లోపు పాలసీ ప్రతిపాదనలను సమర్పించి తగిన రశీదు తీసుకోవాలని తెలిపారు. అదే విదంగా 55 సంవత్సరములు దాటిన ప్రభుత్వ ఉద్యోగులు ప్రీమియం హెచ్చింపు చేయరాదని, అదే విధంగా తేది 30-6-2022 తరువాత సమర్పించిన ప్రతిపాదనలను అంగీకరించబడవని ఆ ప్రకటనలో తెలిపారు.