సీనియర్ పాత్రికేయులు ఎన్.సత్యనారాయణ సమాజానికి అందించిన సేవలు ప్రశంస నీయమని జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి, వైజాగ్ జర్నలిస్టుల ఫోరం అధ్యక్షుడు గంట్ల శ్రీనుబాబు కొనియాడారు. ఈ మేరకు శుక్రవారం విశాఖలోని గోపాలపట్నం ఆయన నివాసంలో సత్యనారాయణ వర్ధంతిని ఆయన మిత్రబృందం ఘనంగా నిర్వహించింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసినఈ కార్యక్రమంలో శ్రీనుబాబు సహచర మిత్రులుతో కలసి పాల్గొన్నారు. తొలుత సత్యనారాయణ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం శీనుబాబు మాట్లాడుతూ, మూడు దశాబ్దాల కాలం పాటు పత్రికా రంగంలో జర్నలిస్టులకు సత్యనారాయణ పూర్తి స్థాయిలో సేవలందించారని వివరించారు. అదేవిధంగా పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు. అనేకమంది మిత్రులు, సన్నిహితులు, పాత్రికేయులు అభిమానులు, మిత్ర బృందం తరపున సుబ్బారావు, మోహన్, నాయుడు, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.