ఉప్పుటేరుకి భారీగా వరదనీరు..
Ens Balu
3
చిన్నగొల్లపాలెం
2020-09-18 15:23:09
క్రిష్ణాజిల్లాలో విపరీతంగా కురుస్తున్న భారీ వర్షాల కరాణంగా కొల్లేరు సరస్సు నుంచి ఉప్పుటేరు మేజర్ డ్రైన్ ద్వారా సముద్రంలోకి పొంగిపొర్లుతుంది. అంతేకాకుండా చిన్న గొల్లపాలెం గ్రామంతోపాటు, పల్లెపాలెం లో ఇళ్ళల్లోనికి నీరు చేరింది. దీనివలన ప్రజలు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు.చిన్నగొల్లపాలెం చరిత్రలో ఇలాంటి మునక అత్యంత అరుదని,కొల్లేరు సరస్సు,యనమదుర్రు డ్రై లనుండి వచ్చే వ్యర్ధ జలాలను సముద్రంలోకి తీసుకెళ్లే ఉప్పుటేరు సముద్రపు మొగవద్ద ఇసుక మేట వేయటం తో నీరు సముద్రము లోనికి వెళ్లే అవకాశం లేక ఈ ముంపుకి గురవుతున్నామని ఆ దీవి గ్రామవాసులు తెలిపారు. వరద నీరు పశ్చిమ గోదావరి జిల్లా కాళీపట్నం-చిన్నగోల్ల పాలెం గ్రామాలను కలుపుతూ ఉప్పుటేరు పై నిర్మించిన వంతెన అప్రోచ్ రోడ్డు పై పొంగి ప్రవహించటం తో ఈ రెండు గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో ఈ ప్రాంతం గూండా భీమవరం,నర్సాపురం,పాలకొల్లు,ఏలూరు ఇతరప్రాంతాలకు వెళ్లే వారు తీవ్ర ఇబ్బందులుపడ్డారు. గతంలో వరదత కారణంగా చిన్నగొల్లపాలెం దీవిలో షుమారు 1500 వందల ఎకరాలకు పైనే సారవంతమైన సర్వే,మామిడి, కొబ్బరి ఇతర ఫల తోటలు కోతకు గురై సముద్రం లో కలిసిపోయి అనేకమంది రైతుల పొలాలు సముద్రంలో కలిసిపోయాయి. తాజాగా తిరిగి ఈ వరద నీరు ఊరి మీదకు రావటంతో అలాంటి దుర్ఘటన పునరావృతం అవుతుందేమోనని రైతులు ఆందోళన చెందుతున్నారు.