లింగనిర్ధారణ చేస్తే కఠిన చర్యలు తప్పవు
Ens Balu
4
Visakhapatnam
2022-05-07 15:45:46
గర్భస్ధ శిశు లింగ నిర్దారణ పరీక్షలు తీవ్రమైన నేరమని దీనిని పూర్తిగా నిర్వహించాలని ఆమేరకు తగు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ డా.ఎ.మల్లిఖార్జున అధికారులకు సూచించారు. శనివారం కలెక్టర్ అధ్యక్షతన పి.సి.పి.ఎన్.డి.టి కమిటి మరియు జిల్లాలో ధరఖాస్తు చేసుకున్న స్కానింగ్ కేంద్రములకు అనుమతులు మంజూరు చేయుట కొరకు వైద్య ఆరోగ్య శాఖ జిల్లా స్థాయి అఫ్రోప్రీయేట్ ఆధారిటి మరియు ఎడ్వజర్ కమిటి సంయుక్త సమావేశం కలెక్టరేట్ సమావేశమందిరంలో నిర్వహించబడినది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో స్కానింగ్ కేంద్రాల కార్యకలాపాలను తనిఖీ లు నిర్వహించాలని కమిటి సభ్యులను ఆదేశించారు. జిల్లాలోని అన్ని స్కానింగ్ కేంద్రంలలో విధిగా స్కానింగ్ రిపోర్టులను ప్రతి నెల జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి వారికి సమర్పించాలని సూచించారు. ప్రతి డివిజన్లో, డెకాయి ఆపరేషన్స్ రెవెన్యూ, పోలీసు మరియు ఇతర సంబందిత అధికారుల సమన్వయంతో నిర్వహించాలని ఆదేశించారు. డెకాయి ఆపరేషన్స్ చేసే టప్పుడు నిబంధనలు పాటించాలని సూచించారు. నిబంధనలు అతిక్రమంచిన స్కానింగ్ కేంద్రాలపై కఠిన చర్యలు తీసుకొనబడునని తెలియజేసారు. ఇటువంటి పరీక్షలు నిర్వహించే వారికి కఠిన చిక్సలు పడతాయన్నారు. లింగ నిష్పత్తిలో భేదం అధికంగా ఉన్న ప్రాంతాలలో అవగాహన కార్యక్రమాలు , ర్యాలీలు, కరపత్రాల పంపిణీ తదితర కార్యక్రమాలను నిర్వహించాలన్నారు. ఈ కార్యక్రమాలలో మహిళా శిశు సంక్షేమ శాఖ, వైద్య శాఖ, లీగల్ సర్వీసెస్, దిశ తదితర సంస్థలను కలుపుకొని పని చేయాలన్నారు. జిల్లా నోడల్ అధికారి డా.మధుసూదన ప్రసాద్ గారు మాట్లాడుతూ స్త్రి , పురుష నిష్పత్తి తక్కువగల మండలాలలో “సేవ్ గర్ల్ చైల్డ్” అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలియజేసారు. డా.విజయలక్ష్మి, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి వారు మాట్లాడుతూ ప్రైవేట్ స్కానింగ్ కేంద్రములలో ఇప్పటి వరకు 271 మందికి ఉచితంగా స్కానింగ్ చేసినట్లు వివరించారు. ధరఖాస్తు చేసుకున్న 21 కేంద్రములకు అనుమతులు మంజూరు చేశారు. ఈ సమావేశంలో జిల్లా వైద్యాధికారి, విజయలక్ష్మి,జిల్లా ప్రోగ్రామ్ అధికారులు అప్రోప్రియేట్ ఆధారిటి మరియు ఎడ్వైజరీ కమిటి సభ్యులు , డెమో విభాగ సిబ్బంది, పోలీసు అధికారులు, తదితరులు పాల్గొన్నారు.