మాత్రు మరణాలు నియంత్రించాలి


Ens Balu
4
Visakhapatnam
2022-05-07 15:53:24

కాన్పు సమయంలో పలు కారణాల వల్ల తల్లులు మరణించడం సంభవిస్తొందని  దీనిని పూర్తిగా నివారించాలని జిల్లా కలక్టర్ డా.ఎ.మల్లికార్జున వైద్యాధికారులను ఆదేశించారు .శనివారం కలక్టరు అధక్షతన మాతృమరణాల పై జిల్లా స్థాయి సమీక్షా సమావేశం కలక్టరేట్ సమావేశ మందిరంలో జరిగింది. ఈ సందర్భంగా కలక్టరు మాట్లాడుతూ డెలివరీ సమయంలో ఏ చిన్న సమస్యను గుర్తించినా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.  వైధ్యులు, ఆశా వర్కర్లు, ఎఎన్ఎమ్ లు, గర్భిణీ స్త్రీలకు తగు సూచనలు సలహాలు ఇచ్చి ఎటువంటి సమస్య లేకుండా డెలివరీలు అయేందుకు కృషి చేయాలన్నారు. రక్తహీనత ఉన్న గర్భణీ స్త్రీలను గుర్తించి మెరుగైన వైద్యం అందించేందుకు నిపుణులు  ఉన్న పెద్ద ఆసుపత్రులకు తరలించాలన్నారు. ఈ సమావేశంలో డా.కె.విజయలక్ష్మి, జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి, డా.మధుసూదన ప్రసాద్, అదనపు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి,  జిల్లా ప్రోగ్రాం అధికారులు, కమిటీ సభ్యులు, వైద్యాధికారులు ,క్షేత్రస్థాయి సిబ్బంది కెజిహెచ్ గైనకాలజీ ప్రొఫెసర్లు, ఎక్సపర్ట్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు .