ట్రాన్సిట్ హాల్ట్ ప్రోటోకాల్ జిల్లాగా విశాఖ..


Ens Balu
10
Visakhapatnam
2022-05-08 03:27:05

ఒకప్పుడు విశాఖలో పనిచేయాలంటే అధికారులందరూ క్యూ కట్టేవారు. అతిపెద్ద మహానగ రం, దానికి సువిశాలమైన రూరల్ జిల్లా ప్రాంతం. జిల్లా కలెక్టర్ నుంచి ఇతర 75శాఖల జిల్లా అధికారులు ఇక్కడ అధికారిగా చేరితే జిల్లాపై పట్టు సాధించడానికే ఏడాదికి పైనే సమయం పట్టేసేది. ఇపుడు జిల్లాల విభజన తరువాత రాష్ట్రంలోనే అతిచిన్న జిల్లాగా విశాఖపట్నం మారిపోయింది. అలా మారిపోయినా రాజధాని ప్రాంతానికున్న ట్రాన్సిట్  హాల్ట్ ప్రోటోకాల్ జిల్లా హోదా విశాఖపట్నానికి వచ్చేసింది. ఇక్కడ అంతర్జాతీయ ఏయిర్ పోర్టు ఉండటం, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వంలోని ఎవరు వచ్చినా ఇక్కడే ప్రోటోకాల్ ఇచ్చే సదుపాయం ఏర్పడిపోవడంతో ఈవిశాఖ మహానగరం ప్రోటోకాల్ మహానగరంగా మారిపోయింది. దీనితో ఈ జిల్లాలో పనిచేయాలంటే ప్రస్తుతం అధికారులంతా హడలిపోతున్నారు. నిత్యం ఏదోఒక రాష్ట్ర అధికారి, రాష్ట్ర మంత్రి, కేంద్ర మంత్రి, ఇతర త్రివిధ దళాల అధికారులుల నిత్యం రాకపోకలు సాగిస్తున్న ప్రాంతంగా మారిపోవడంతో విశాఖలో పనిచేయాలంటే ఇపుడు అధికారులు కాస్త తడుముకుంటున్నారు. ఒకప్పుడు విశాఖసిటీలో పనిచేయడమంటే అఖిలభారత స్థాయి అధికారులకే కాదు, జిల్లాశాఖల అధికారులకు కూడా ఒక పేషన్ గా ఉండేది. కొత్తజిల్లాలతో స్వరూపం పూర్తిగా మారిపోయి అతి చిన్నజిల్లా మారిపోవడంతోపాటు ప్రముఖుల తాకిడి అధికమైపోయింది. 

చుట్టు ప్రక్కల జిల్లాలైన విజయనగరం, శ్రీకాకుళం, అల్లూరి సీతారామరాజు జిల్లా, అనకాపల్లి జిల్లా, పార్వతీపురం మన్యం జిల్లా ఆఖరికి విశాఖపట్నంజిల్లాను సందర్శించడానికి నిత్యం ఏదోఒక శాఖ అధికారి రావడంతో సమూహ జిల్లా ముఖ ద్వారంగా ట్రాన్సిట్ హాల్ట్ ప్రోటోకాల్ డెస్టినేషన్  గా విశాఖపట్నం మారిపోయింది. జిల్లా అధికారులకైతే సదరు జిల్లాశాఖల పనికంటే ఆయా ప్రభుత్వశాఖల ప్రోటోకాల్ డ్యూటీలే అత్యధికంగా తగులుతున్నాయి. దీనితో విశాఖజిల్లా నుంచి తమ సొంత జిల్లాలుగానీ, దగ్గర్లోని జిల్లాలకు గానీ వెళ్లిపోయేందుకు అధికారులంతా విశ్వ ప్రయత్నాలూ చేస్తున్నారు. ఇప్పటికే కొందరు బదిలీల్లో వెళ్లిపోతుండగా మరికొందరు ముమ్మరంగా యత్నిస్తున్నారు. ఇదే సమయంలో కొన్ని ప్రాధాన్యతలేని ప్రభుత్వశాఖల అధికారులను కూడా ప్రభుత్వం ఈ ట్రాన్సిట్ హాల్ట్ ప్రోటోకాల్ విధులకు వినియోగిస్తుందనే ప్రచారం కూడా జరుగుతుంది. కొందరు అధికారులకు ఈ ప్రోటోకాల్ డ్యూటీలు ఆటవిడుపుగా వుంటున్నా ఎక్కువ మంది అధికారులకు తలకు మంచిన ఆర్ధిక భారం పడుతోందనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. అందులోనూ ట్రాన్సిట్, ప్రోటోకాల్ జిల్లా అయినప్పటికీ జిల్లా కేంద్రంలో అధికారులు, ముఖ్యమైన అధికారపార్టీ ప్రతినిధులు వచ్చే సమయంలో వారికి భద్రతా పరమైన వాహనాలను ఏర్పాటు చేసే పరిస్థితి కూడా లేపోతుంది. దీనితో ప్రైవేటు వాహనాలనే జిల్లా కలెక్టర్ నుంచి జిల్లాశాఖల అధికారులు ఆవ్రయించాల్సి వస్తుంది. అపుడెప్పుడో 15ఏళ్ల క్రితం కొన్న ప్రోటోకాల్ వాహనాలు తప్పితే..తరువాత ఏ ప్రభుత్వం కూడా కొత్తగా వాహనాలను కొనుగోలు చేయలేదు. దీనితో వాహనాల ఏర్పాటుకి కూడా అధికారులు తలలు పట్టుకుంటున్నారు. అన్నీ వెరసీ సుందరమైన మహానగరం విశాఖపట్నం రాష్ట్రంలోనే అతిచిన్నజిల్లా మారి ఆఖరికి ట్రాన్సిట్ హాల్ట్ ప్రోటోకాల్ జిల్లాగా మిగిలిపోవడం రాష్ట్రంలోనే ఒక హాట్ టాపిక్ గా మారిపోయింది.