విద్యార్థుల మనో వికాసానికి క్రీడలు అవసరం


Ens Balu
2
Parvathipuram
2022-05-08 06:45:07

విద్యార్థులకు క్రీడలు చాలా ముఖ్యమని ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి  ఆర్. కూర్మనాథ్   తెలిపారు. ఆదివారం స్థానిక జూనియర్ కళాశాల క్రీడా  మైదానంలో వేసవి కాల క్రీడా శిక్షణా తరగతులను ఆయన ప్రారంభించారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో 70 క్యాంపులు ఏర్పాటుచేసి, 15 క్రీడల  నందు శిక్షణ ఇస్తున్నట్లు  తెలిపారు. ఆర్చరి, అథ్లెటిక్స్, ఖోఖో, కబడ్డీ, వాలీబాల్, హ్యాండ్ బాల్, షటిల్ బ్యాడ్మింటన్, బాల్ బ్యాడ్మింటన్, హాకీ, చెస్, తైక్వాండో, కరాటే, బాస్కెట్ బాల్, ఫెన్సింగ్  మరియు యోగ లలో  శిక్షణా తరగతులు  అందిస్తారని తెలిపారు.   పాఠశాల లలో  ఆటలకు ప్రాధాన్యత ఇవ్వాలని, విద్యార్థుల మనోవికాసానికి, దేహ దారుఢ్యానికి క్రీడలు చాలా అవసరమని అన్నారు. నేటి కార్పొరేట్ విద్యా విధానంలో క్రీడలకు ప్రాధాన్యత ఇవ్వడం లేదని దానివల్ల విద్యార్థులు ఎంతో మానసిక ఒత్తిడికి గురవుతున్నారని,  ఈ క్రీడా శిబిరానికి విద్యార్థుల పంపిన తల్లిదండ్రులను అభినందిస్తున్న ట్లు తెలిపారు.  తల్లిదండ్రులు కూడా క్రీడల పట్ల ప్రోత్సాహం ఇవ్వాలని విద్యార్థులు ఆటలలో పాల్గొనే విధంగా ప్రోత్సహించాలని కోరారు.  ఈ క్రీడా శిబిరంలో  శిక్షణ తీసుకున్న  విద్యార్థులు  చక్కగా రాణించి, పతకాలు  సాధించాలన్నారు. ఈ కార్యక్రమంలో  ట్రైబల్ వెల్ఫేర్, ఉపసంచాలకులు కిరణ్ కుమార్, డుమా ప్రాజెక్ట్ డైరెక్టర్ రామచంద్ర రావు, డి ఎస్ డి ఓ వెంకటేశ్వరరావు, డిప్యూటీ డిఎం హెచ్ ఒ అనిల్ కుమార్, కోఆర్డినేటర్ ఎం వాసుదేవరావు, జాతీయ ఆటగాడు జి గోపాల్  తదితరులు పాల్గొన్నారు.