నేటి సమాజానికి స్పూర్తి భగీరధుడు..


Ens Balu
4
Parvathipuram
2022-05-08 07:26:51

భగీరథ మహర్షి  నేటి సమాజానికి స్ఫూర్తి అని ఐటిడిఎ ప్రాజెక్ట్ అధికారి ఆర్ కూర్మనాథ్ తెలిపారు. ఆదివారం జిల్లా బిసి సంక్షేమ  శాఖ కార్యాలయంలో  భగీరథ మహర్షి జయంతిని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ప్రాజెక్టు అధికారి   మాట్లాడుతూ పరోపకారానికి, దీక్షకు, సహనానికి  ప్రతిరూపమైన భగీరధుని ఆదర్శంగా తీసుకొని సమాజం కొరకు సేవ  చేయాలన్నారు.   కఠోర పరిశ్రమ చేసి దేనినైనా సాధించగలమని భగీరథ నిరూపించారని వారిని స్ఫూర్తిగా తీసుకొని యువత లక్ష్యాలను సాధించి విజయాలు అందుకోవాలని తెలిపారు.  భగీరథుని చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా బీసీ వెల్ఫేర్ అధికారి ఎస్. కృష్ణ,  పంచాయతీరాజ్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ వై విజయ్ కుమార్, గ్రామీణ నీటి సరఫరా, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ప్రభాకర్ రావు, బిసి వెల్ఫేర్ కార్యాలయం సూపరిండెంట్ సన్యాసిరావు, సిబ్బంది హాజరైనారు.