తిరుపతి కలెక్టరేట్ కి ఆర్టీసీ బస్సు సౌకర్యం
Ens Balu
3
Tirupati
2022-05-08 07:56:40
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న స్పందన కార్యక్రమం ఈ నెల 9 వ తిరుపతి జిల్లా కలెక్టరేట్లో ప్రతి సోమవారం నిర్వహణ ఉంటుందని జిల్లా కలెక్టర్ కె. వెంకటరమణా రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా కలెక్టరేట్ లో జరిగే స్పందన కార్యక్రమానికి తిరుపతి ఆర్ టి సి బస్ స్టాండ్ నుండి బస్సు సౌకర్యం ఉందని అర్జీ దారులు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. స్పందన కార్యక్రమానికి ఆయా శాఖల ఉన్నతాధికారులు తప్పనిసరి హాజరు కావాలని ఆదేశించారు. జిల్లాలోని గ్రామ/వార్డు సచివాలయాల్లో ప్రతి రోజూ సాయంత్రం తప్పనిసరిగా స్పందన వినతులను స్వీకరించాల్సి ఉంటుందని అలాగే సచివాలయ సిబ్బంది సంబంధిత అధికారులకు ఆ వినతులను పరిష్కార నిమిత్తం వెంటనే పంపేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఒక ప్రకటనలో తెలియజేసారు.