సాగునీరు, త్రాగునీరు క్రిందకు తెచ్చిన మహా వ్యకిని నేడు స్మరించు కోవడం, అటువంటి మహనీయుని జయంతి వేడుకలు జరుపుకోవడం మన అందరి అదృష్టమని రాష్ట్ర శాసన సభాపతి తమ్మినేని సీతారాం పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఆదివారం మహర్షి భగీరథ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శాసన సభాపతి మాట్లాడుతూ లక్ష్య నిర్దేశంతో చేసే ఏ ప్రయత్నంలోనైనా విజయాన్ని సాధించవచ్చని, భగీరథ మహర్షి జీవిత సారాంశమన్నారు. భగీరథ మహర్షి గంగని పూజించి నేలపైకి తెచ్చినరోజు ఈ రోజని, అటువంటి మహర్షి జయంతి వేడుకలు నిర్వహించు కోవడానికి ప్రధాన కారణం ముఖ్య మంత్రి వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి అని వివరించారు. ప్రతి ఒక్కరూ భగీరథ దీక్షతో ప్రభుత్వ సంక్షేమ అభివృధి కార్యక్రమాలు అర్హులైన లబ్ధిదారులకు అందించేలా కృషి చేయాలన్నారు. బి.సి.అంటే బేక్ బోన్ ఆఫ్ కంట్రీ మనం బలహిన వర్గాలకు చెందిన వారమే కానీ బలహీనుల కాదని గుర్తించాలన్నారు. తప్పసుతో శక్తిని సంపాదించిన మహావ్యక్తి, పిల్లలు అనుకున్నది సాధించ గలరనే అనే సంకల్పంతో ఫలితాలు సాధించేలా భగీరథ ప్రయత్నం చేయాలన్నారు. మహనీయుల గొప్పతనాన్ని వెలికితీసి వారి ఆదర్శ భావాలకు అనుగుణంగా ప్రభుత్వం అధికారికంగా ఇలాంటి కార్యక్రమాలను చేపట్టినందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.
మహర్షి భగీరథ చిత్ర పటానికి రాష్ట్ర శాసనసభాపతి తమ్మినేని సీతారాం, జాయింట్ కలెక్టర్ ఎం.విజయసునిత, తదితరులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. జిల్లా జాయింట్ కలెక్టర్ ఎం. విజయ సునీత మహర్షి భగీరథ ఋషి జీవిత చరిత్రను స్మరించుకున్నారు. ఈ వేడుకలలో బి.సి కార్పొరేషన్ ఇ.డి గడెమ్మ, రెవెన్యూ డివిజనల్ అధికారి బొడేపల్లి శాంతి, బి.సి.వెల్ఫేర్ ఆఫీసర్ వెంకటరత్నం, జాతీయ బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు పిట్ట. చంద్రపతి రావు, సగర /ఉప్పర సంఘం జిల్లా అధ్యక్షులు పిండి వేంకట రామారావు, కార్యదర్శి గజ్జల మాధవ రావు, నక్క సాయి కుమార్, వివిధ శాఖల అధికారులు సిబ్బంది, పలు కళాశాలల, పాఠశాలల విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.