ఏది నిజం..? ఏది కల్పితం..? ఏమాకధ..?


Ens Balu
6
Simhachalam
2022-05-09 03:53:41

విశాఖలోని సింహాచలం దేవస్థానంలో అసలు విషయాన్ని పక్కన పెట్టి పెసల బేరాన్ని తెర పైకి తీసుకు రావడానికి కారణం ఏమిటీ? అసలు దేవాదాయ, ధర్మాదాయశాఖ కమిషనర్ డా.హరిజవహర్ లాల్ ఇచ్చిన మెమో ఏంటి? బయట మీడియాలో జరుగుతున్న ప్రచార మేంటి? ఎందుకు వాస్తవాలను తప్పుదోవ పట్టిస్తున్నారు? అసలు సింహాచలం దేవస్థానంలో ఏం జరుగుతుంది? తెరువెనుక సూత్రదారులెవరు? తెరముందు డైరెక్టర్లు ఎవరు.. అనే అను మానాలు విశాఖలో ప్రతీ ఒక్కరినీ కదిలిస్తున్న ప్రశ్నలు. సరిగ్గా వాటికి ఊతమిస్తూ దేవాదా య శాఖ కమిషనర్ డా.హరిజహర్ లాల్ సింహాచలం దేవస్థానంలో జరిగిన పరకామణి లెక్కింపు విషయంలో ఏసి శాంతి, ఏఈఓ రమణమూర్తిలు, సిబ్బంది పరకామణి లెక్కింపులో షర్టులు వేసుకొని విధులకు హాజరైన విషయంలో సంజాయిషీ ఇవ్వాలనే విషయంలో తాకీదులు జారీచేస్తే..అది పక్కన పెట్టి ట్రస్టుబోర్డు సభ్యుడు, జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి, విజెఎఫ్ అధ్యక్షుడు గంట్ల శ్రీనుబాబు విషయంలో బురదచల్లే కార్యక్రమానికి తెరలేపారు. అసలు సింహాచలం దేవస్థానంలో జరిగిన కొన్ని వాస్తవాలు తెలుసుకుంటే.. సింహాచలం దేవస్థానంలో ట్రస్టుబోర్డు ఏర్పాటైన తరువాత..స్వామివారి వైభవం మరింతగా పెరిగింది. అదే సమయంలో ట్రస్టుబోర్డు సభ్యులు చాలా మంది దాతల ద్వారా స్వామివారికి విరాళాలు ఇప్పించే విషయంలో కీలకంగా వ్యహరించారు. అందులో శ్రీనుబాబు పాత్ర చాలా ప్రముఖంగా వుందనేది జగమెరిగిన సత్యం. అంతేకాదు దేవస్థానంలో ఆయన సేవలు అటు ప్రభుత్వంలోనూ, ఇటుప్రజలకూ చాలా బాగా తెలుసు. పైగా తాను సంపాదించిన మొత్తంలో 10శాతానికిపైగా దానాలు, సేవలు, వ్రుద్ధాశ్రమాలకు వితరణ చేస్తుంటారు. ఎందరో పేద విద్యార్ధులను చదివించిన ఘనత కూడా శ్రీనుబాబుది. జర్నలిస్టుల పక్షపాతిగా ఉన్న ఏకైన జర్నలిస్టు సంఘ నాయకుడు ఆయన అలాంటి వ్యక్తిపై ఒక్కోసారి తేడా ప్రచారాలు సర్వసాధారణం.. 

ఏదైనా ఒక సంస్థ, ఆలయం, దేవస్థానం ప్రాచుర్యం పొందాలంటే ఆలయంలోని స్వామివారి శక్తి ప్రజలపై ప్రభావం చూపిస్తుంటుంది. అలాంటి సింహాచల దేవస్థానంలో అప్పన శక్తి ఎవరికీ తెలియనది కాదు. అంతటి లక్ష్మీనారసింహుని ముందు ఎవరూ కుప్పి గంతులు వేయాలని కూడా చూడరు. అది పాపం కూడా.. చూస్తూ చూస్తూ పాపపు పనులు బుద్దున్నవాడెవడూ ఆలయంలో చేస్తాడంటే ఎవరు మాత్రం నమ్ముతారు... ఈ వార్త చదువుతున్న మీకైనా ఎపుడైనా నోట్ల కట్టలపైనా, నాణేలాను తొక్కాలని, వాటిపై కూర్చావాలనే ఆలోచనా వచ్చిందా..? అంటే రాదు..డబ్బు అంటే లక్ష్మీదేవి కనుక. ఆ దేవతా మూర్తికి అపారమైన గౌరవం ప్రపంచంలోని ప్రతీ మానవుడూ ఇస్తాడుగనుక. ఇక్కడ ఒక సాంకేతిక అంశాన్ని ప్రతీ ఒక్కరూ గమనించాల్సి వుంటుంది. ఎంతటి కోటీశ్వరుడైనా డబ్బులపై కూర్చునే సాహసం చేయరు. అందులోనూ దేవస్థానంలో అసలే చేయరు. డబ్బులు అంటే లక్ష్మీదేవితో సమానం. అలాంటి లక్ష్మీదేవి స్వరూపమైన డబ్బులపై కూర్చుంటే పరిస్థితి చాలా తేడాగా వుంటుందని అందరికీ తెలుసు. కానీ పరకామని లెక్కింపు విషయంలో చుట్టూ డబ్బులు ఉండి మధ్యలో ఎవరైనా వ్యక్తులు కూర్చుంటే వారు డబ్బులపైనే కూర్చున్నారనే బ్రమ కలుగుతుంది. అది ఒక్కోసారి ఫోటో ట్రాఫర్ చేతి మెలకువగా కనిపిస్తుంది. అదేవిధంగా ట్రస్టుబోర్డు సభ్యుడు కూడా పరకామణి పర్యవేక్షణకు ఆలయ అధికారులు ప్రోటోకాల్ విషయంలో పంపిన ఆహ్వానం మేరకు మాత్రమే వెళ్లారు. అక్కడ పర్యవేక్షణలో భాగంగానే పరకామణి లెక్కింపు మధ్యలో కూర్చున్నారు. కాలికి అడ్డంగా వున్న నోట్లను దండంపెట్టి పక్కకు తీసే సమయంలో తీసిన ఫోటోను వైరల్ చేయడం అంటే ఒకరకంగా తేడా  పబ్లిసిటీ  అయిపోతుందని గమనించాలి. అదే సమయంలో మధ్యలోకి షర్టు వేసుకొని వచ్చిన ఏఈఓ రమణమూర్తి , ఏసి శాంతిల విషయంపై ఫిర్యాదులు వెళ్లడంతో వాటిపై వివరణ కావాలని కోరితే ఏకంగా ట్రస్టుబోర్డు సభ్యుడి వలన ఏదో జరిగిపోతుందనే విషయాన్ని తెరపైకి తీసుకురావడం వెనుక అసలు తాకీదులు వచ్చిన వారిని రక్షించే ప్రయత్నం చేస్తున్నారనే ప్రచారం కూడా జోరుగా సాగుతోంది.

ఇక ట్రస్టుబోర్డు సభ్యుడు గంట్ల శ్రీనుబాబు విషయానికొస్తే..ఆయన స్వస్థలం సింహాచలం.. ఆయన కుటుంబానికి ఆరాధ్య దైవం సింహాచల సింహాద్రి అప్పన్న. సాధారణంగానే శ్రీనుబాబు అప్పన్నకు వీరభక్తుడు. దేవుడు కొలువైన ఆలయంలో ఆయన కళ్లకి గంతలు కట్టి ఆలయంలోనికి పంపిస్తే అనవణువూ తిరిగి మళ్లీ ఆలయం బయటకు రాగల అవగాహన, పట్టు ఆలయంపై ఉన్నాయి ఆయను. శ్రీనుబాబు సేవలను గుర్తిస్తూ ప్రభుత్వం కూడా స్వామివారి సేవకు శ్రీనుబాబును ఎంపిక చేసి ట్రస్టుబోర్డు సభ్యుడిగా నియమించింది. ఈయన నియామకం తరువాత ఆలయాన్ని, ఆలయంలో జరుగుతున్న కార్యక్రమాలను అన్ని రకాల మీడియా ద్వారా ప్రజల్లో విస్త్రుతంగా తీసుకెళ్లడంలో శ్రీనుబాబు చాలా కీకలంగా వ్యవహరించారు. అంతేకాదు చాలా మంది దాతల ద్వారా స్వామివారి సేవకు విరాళాలు తీసుకు రావడంలో ప్రధాన భూమిక పోషించారు. ఏం చేసినా స్వామి సేవలో అన్నట్టుగా ఉంటారాయన. ఈ ఉరుకుల పరుగుల జీవనంలో చావు కార్యాలకు వెళ్లాలంటే నూటికి 80శాతం మంది వెనుకడుగు వేస్తారు. కానీ శ్రీనుబాబుకి తెలిసిన వారు ఏ సమయంలో మ్రుత్యువాత పడినా.. తక్షణమే వారి కుటుంబాన్ని పరామర్శించడంతోపాటు, దహన కార్యాలకు ప్రభుత్వం కూడా సహాయం చేయని విధంగా రూ.5వేలు మట్టిఖర్చులకు ఇచ్చి వస్తారు. ఏ జర్నలిస్టు ఆసుపత్రిలో ఉన్నా వారిని ఆదుకోవడానికి మందుల ఖర్చు, ఆసుపత్రి వైద్యం ఆయన దగ్గరుండి చేయిస్తారు. తెల్లవారి లెగిస్తే 24 గంటల్లో కనీసం ఐదు గంటలకు ప్రజా సేవకే అంకితం చేస్తారు. నిజంగా ఆమాటలు వింటే ఎవరైనా సేవకు ముందుకొస్తారు.. ఆ ఒక్క మాటే చెప్పే శ్రీనుబాబు ఎపుడూ చెబుతుంటారు.. పుట్టినపుడు తల్లి రక్తమాంసాలనే బట్టగా చేసుకొని పుడతాం.. పోయేటపుడు కుటుంబుం ఇచ్చిన ఆ ఒక్క తెల్లగుడ్డతోనే పోతాం..అదీ కూడా మన వెంట రాదు..కాటికాపరి తీసుకొని...మనపై కట్టె పేరుస్తాడని..అలాంటి జీవితానికి నిశ్వార్ధ సేవ ఒక్కటే మార్గమని తలిచి అప్పన్న ఆశీస్సులతోనే తాను ఈ సేవాల కార్యక్రమాలు చేయగలగుతున్నానని తడుముకోకుండా చెబుతారు.

ఇక ఆఖరిగా వివాదంలో ప్రధాన పాత్ర పరకామణి లెక్కింపు సమయంలో సిబ్బంది చొక్కాలు ధరించకూడదు అది వాస్తవం. అన్ని రూలు ప్రకారం చేసే దేవస్థాన ఈఓ ఈ విషయాన్ని ఎందుకు పెడచెవిన పెట్టారు..అంటే ప్రభుత్వ ఆదేశాలు అమలు చేసే ఇష్టం లేదని తేలిపోయింది. ఏక పక్షనిర్ణయాలు, ట్రస్టు సభ్యుల మెప్పు కోసం కార్యక్రమాలు, స్వామిదర్శనాలు ఇతరత్రా వ్యవహారాలు చేసే టపుడు ఆ పనులన్నీ వారితో చేయించేస్తే బాగుంటుందని ఈఓ చేపట్టిన పనులపై ఏ ఒక్క మీడియా వార్తలు రాయలేదు. అలాగని స్వామివారికి నిశ్వార్ధంగా సేవచేసిన వారి విషయంలోనూ వార్తలు రాలేదు. కానీ ప్రభుత్వం నుంచి వచ్చిన ఉత్తర్వులు ఒకటి..దానిపై వచ్చే ప్రచారం ఒకటి రావడంతోనే అసలు తెరవెనుక ఏంజరుగుతుందనేది బయటకొచ్చింది.  పరకామణి విషయంలో వచ్చిన ఉత్తర్వులు శ్రీనుబాబు చుట్టూ పేర్చడం, డబ్బులపైనే ఆయన కూర్చున్నాడని, అతనిపై చాలా ఆరోపణలు ఉన్నాయని చెప్పడం బట్టీ చూస్తుంటే ఏదో జరుగుతుందనేది స్పష్టం అవుతుంది. దానిపై ఆరోపణల కోణాన్ని చూపడం అటుంచితే.. అసలు సింహాచలంలో ఏం జరుగుతుందనే విషయాన్ని ప్రభుత్వంగానీ, ఇతర మీడియా సంస్థలు గానీ ఎందుకు వాస్తవాలు బయటకు తీయడం లేదని ప్రశ్నించం.. అది మాపని కాదు.. చిన్న విషయాలు బూతద్దంలో చూపిస్తే. పెద్ద మొత్తంలో జరిగిన విషయాలు మరుగున పడిపోతాయనేది ప్రధాన కారణం ఇక్కడ చాలా స్పష్టంగా కనిపిస్తోంది. అసలు విషయాన్ని పక్కకు నెట్టేసి..పెసల విషయాన్ని రాద్దాం చేయవచ్చుననేది మరోక అంశం.. ట్రస్టుబోర్డు తాత్కాలికం..కాని పరకామణి వ్యవహారం శాస్వతం..కనీసం సీసి కెమెరాల పర్యవేక్షణ, ఈఓ పర్యవేక్షణ ఎందుకు చేపట్టలేదనే కోణం ఎక్కడికి పోయింది.? చొక్కాలు వేసుకువచ్చిన సిబ్బంది కరోనా సమయంలో మాస్కులు ఎందుకు ధరించలేదు, శానిటైజర్లు ఎందుకు వాడలేదు, సామాజిక దూరం ఎందుకు పాటించలేదు. ఈ ప్రధాన కారణాలు లోపాలు ఎక్కడికిపోయాయి...? అవన్నీ కాకెత్తుకెళ్లిపోయిందా..? అదీ కాదు..దేవాదాయశాఖ కమిషనర్ డా.హరిజవహర్ లాల్ నుంచి తాకీదులు రావడంతో అదే అదునుగా అంతా కాస్త హడావిడీ చేసే ప్రయత్నం చేశారు. ఇంత జరిగినా ఏ ఒక్క జర్నలిస్టూ ఈఓని, ఏం జరిగిందని ఏసి శాంతని సైతం వివరణ కోరలేదు.. కానీ కమిషనర్ ఇచ్చిన Proceedings in Rc.No.V1/20026/7/2022-1, Dt: 04/05/2022 ఉత్తర్వులు ఈఎన్ఎస్ వద్ద పదిలంగా ఉన్నాయి..

ఇక్కడ ఈఎన్ఎస్ నేషనల్ న్యూస్ ఏజెన్సీ, అధికారి మొబైల్ న్యూస్ యాప్ ens live, అధికారిక న్యూస్ వెబ్ సైట్ www.enslive.net ఎవరికీ కొమ్ముకాయదు. అలాగని శ్రీనుబాబు సేవలను గుర్తు చేస్తూ వార్త ఇచ్చినంత మాత్రాన ఆయనకి విధేయత అనీకాదు.. వాస్తవాలను మాత్రమే ఈఎన్ఎస్ లైవ్ ప్రజలు, ప్రభుత్వం ముందు ఉంచుతుంది. ఇంత స్థాయిలో ప్రజలను ఆలోచించజేసే విధంగా వార్త రాసినందుకు నాకు ఏదో పెద్ద మొత్తంలో ముట్టిందని అనుకున్నా పోయేది ఏమీ లేదు. అలాగని ఇదే వ్యక్తి తేడా పనులు చేసినా ఇదేస్థాయిలో వార్తలు రాస్తామని కూడా బల్లగుద్ది మరీ చెబుతున్నాం. ఎవరైనా మంచిని మంచిగానే స్వీకరించాలి... చెడుని చెడుగానే పరిగణించాలి.. సేవా బావం కోణంలోనే ప్రజలకు తెలియజేయాలి. ఆ విషయంలో ఈఎన్ఎస్ తన పంధాను మార్చుకోదని చెబుతున్నాం. ఈ విషయంలో మీడియా సంస్థలుగానీ, అందులోని ప్రముఖులుగానీ నా విషయంలో ఏంటీ కాస్త తేడాగా ఉందే వ్యవహారం అని అనుకున్నా ఇబ్బందేమి లేదు. వచ్చిన నష్టమూ లేదు. ముందే చెప్పాం ఏం జరిగినా..జరిగింది ..జరిగినట్టుగానే ప్రజల ముందుకి తీసుకెళతామని. ఇలాంటి విషయంలో ఏదీ ఆశించాల్సిన అవసరం, సందర్భం ఈఎన్ఎస్ కి లేదు. రాదు, రాబోదు. వాస్తవాలకు ప్రజలు, ప్రభుత్వం పెద్ద పీట వేస్తుందని ప్రగాఢంగా నమ్మే మీడియాగా ఏది నిజం..? ఏది కల్పితం..? ఏమాకధ..? రూపంలో ఈ కధనాన్ని అందిస్తున్నాం. ఇంతలా రాసిన మేము.. రేపు అన్నరోజు తేడా వచ్చినా అంతకంటే భారీస్థాయిలోని పతాక శీర్షికతోనే మీ ముందుకి నిర్భయంగా వస్తామని గుర్తుచేస్తున్నాం. సేవను గౌరవించండి.. సేవకులను గుర్తించండి.. సేవపేరుతో నాటకాలాడే అధికారులను, ప్రజాప్రతినిదులను ప్రజలముందుంచండి..!