డేటా ఎంట్రీ ఆపరేటర్లను నియమించండి..


Ens Balu
6
Vizianagaram
2022-05-09 05:55:07

విజయనగరం జిల్లాలోని వివిధ శాఖల విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల‌ను త్వరిత‌గ‌తిన భ‌ర్తీ చేయాల‌ని జిల్లా క‌లెక్ట‌ర్ ఎ. సూర్య‌కుమారి అధికారుల‌ను ఆదేశించారు. ఈ మేరకు సోమవారం కలెక్టరేట్ హాలులో అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ముఖ్యంగా ఆయా శాఖల్లో ఖాళీగా ఉండే డేటా ఎంట్రీ ఆప‌రేట‌ర్ల‌ను నియ‌మించేందుకు చ‌ర్య‌లు చేప‌ట్టాల‌ని అధికారులకు సూచించారు. దానికోసం శాఖల వారీగా జిల్లా శాఖల అధికారులు వివరాలు తెలియజేయాలన్నారు. అంతేకాకుండా  డీడీఓల కోడ్‌ల‌ను పునఃప‌రిశీలించుకోవాల‌ని ఈ సంద‌ర్భంగా అధికారులను ఆదేశించారు. డేటా ఎంట్రీ ఆపరేటర్లను నియమించుకొని ప్రభుత్వ కార్యకలాపాలకు ఆలస్యం కాకుండా చూసుకోవాలని జాల్లా  కలెక్టర్ అధికారులకు సూచించారు.