డిప్యూటీ సీఎం బూడిని కలిసిన మంజుల


Ens Balu
3
Visakhapatnam
2022-05-09 09:15:35

ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, పంచాయతీరాజ్ ,గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి బూడి మత్యాలనాయుడుని గాజువాక వైఎస్ఆర్సిపీ మహిళా నాయకులు, వాంబే కాలనీ శ్రీశ్రీశ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం ధర్మకర్త మంత్రి మంజుల సోమవారం విశాఖలోని సర్క్యూట్ హౌస్ లో మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా గాజువాకలోని  వెంకటేశ్వర స్వామివారి ఆలయాన్ని సందర్శించాలని డిప్యూటీ సీఎంను ఆమె కోరారు. అనంతరం మూడు జిల్లాల కోఆర్డినేటర్, టిటిడి చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ని కూడా ఆమె మర్యాదపూర్వకంగా కలిసి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ సీపీ మహిళా నాయకులు, తదితరులు పాల్గొన్నారు.