మహాత్మా గాంధీ కలలుగన్న పరిశుభ్ర భారతావని కోసం ప్రతి ఒక్కరూ స్వచ్ఛభారత్ కార్యక్ర మాల్లో పాల్గొనాలి అంటూ ప్రభుత్వ పురుషుల డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డా.పి.సురేఖ తెలి పారు. శ్రీకాకుళం ప్రభుత్వ డిగ్రీ పురుషుల కళాశాల లో మంగళవారం ఉదయం స్వచ్ఛభా రత్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి స్టార్ వాకర్స్ క్లబ్, ఎన్ సి సి, క్రికెట్ అసోసియేషన్ సభ్యులు స్వచ్ఛందంగా వచ్చి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ సురేఖ మాట్లాడుతూ పరిశుద్ధమైన, ఆరోగ్యవంతమైన భారత్ ను ఆవిష్కరించాలన్న మహాత్ముని కలను నిజం చేసి చూపించాలని దేశ ప్రధాని నరేంద్ర మోడీ ఆశయ సాధన, రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి స్ఫూర్తి, జిల్లా కలెక్టర్ శ్రీకేష్ లాఠకర్ సూచనలతో ఈరోజు ప్రభుత్వ పురుషుల డిగ్రీ కళాశాల ఆవరణలో స్వచ్ఛ భారత్ కార్యక్రమం నిర్వహించడమైనది. ప్రతి నెల 10వ తేదీన ఈ కార్యక్రమం నిర్వహించనున్నట్లు ప్రిన్సిపాల్ తెలిపారు. మనం మన పరిసరాలు శుభ్రం చేసుకోవాలి లనే సంకల్పంతో ఈ కార్యక్రమం నిరభిచమని ఇది ఇక్కడికే పరిమితం కాకుండా ఎన్.సి.సి విద్యార్థులు ప్రతి ఒక్కరూ చెత్తను వీధుల్లో వేయకుండా ప్రజల్లో అవగాహన కల్పించాలన్నారు. ఈ కార్యక్రమ నిర్వహణకు శ్రీకాకుళం మున్సిపల్ కమిషనర్ పూర్తి సహకారం అందించారన్నారు.
ఈ స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో వాకర్స్ ఇంటర్నేషనల్ గవర్నర్ పి.జి.గుప్తా,మాజీ గవర్నర్లు జి.ఇందిరాప్రసాద్, గుడ్ల సత్యనారాయణ ,స్టార్ వాకర్స్ క్లబ్ అధ్యక్షుడు శాసపు జోగినాయుడు,క్లబ్ ప్రతినిధులు గోలీ ఉమామహేశ్వరరావు,ఎం.మల్లిబాబు, గోలీ సంతోష్,డాక్టర్ జి.నారాయణరావు , ఎన్.సి.సి విద్యార్థులు, క్రికెట్ అసోసియేషన్ సభ్యులు, కళాశాల లెక్చరర్స్, సిబ్బంది విద్యార్థులు పాల్గొన్నారు.