అనకాపల్లి జిల్లాలో జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి తమ వంతు కృషి చేస్తామని జిల్లా కలెక్టర్ రవి పట్టన్ శెట్టి తెలిపారు. మంగళవారం అనకాపల్లి ఏపీయూడబ్ల్యూజే ప్రతినిధులు జిల్లా కలెక్టర్ ను కలిసి వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా స్థాయిలో పరిష్కరించ దగ్గ సమస్యల పై తగు చర్యలు తీసుకుంటామన్నారు. మిగిలిన అంశాలపై ప్రభుత్వానికి నివేదిస్తామని చెప్పారు. ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ పిలుపుమేరకు మే 10 మంగళవారం అనకాపల్లి జిల్లా కలెక్టర్ రవి పట్టన్ శెట్టి గారికి జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం వినతి పత్రం ఇవ్వడం జరిగిందని జర్నలిస్టు నాయకులు తెలిపారు. ఏపీయూడబ్ల్యూజే కలెక్టర్ కు నివేదించిన అంశాలు తెలుసుకుంటే.. కేంద్ర ప్రభుత్వం తక్షణం మీడియా కౌన్సిల్ ఏర్పాటు చేయాలని, ఇందులో అన్ని జాతీయ సంఘాలకు ప్రాతినిధ్యం కల్పించాలని కోరారు. ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో నిబంధనల ప్రకారం అక్రిడిటేషన్ లు మంజూరు చేయాలని, మీడియా ప్రతినిధులు, మీడియా సంస్థల పై దాడులను అరికట్టాలని, మీడియా స్వేచ్ఛగా పనిచేసే పరిస్థితులు కల్పించాలని కోరారు. అన్ని స్థాయిలలో పనిచేస్తున్న జర్నలిస్టులకు రాయితీ రైల్వే పాసులు మంజూరు చేయాలని, వర్కింగ్ జర్నలిస్టులందరికీ వేతనాలు ఇవ్వడానికి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, కరోనా వ్యాధి తో మరణించిన జర్నలిస్ట్ కుటుంబాలకు రూ.5 లక్షలు ఇస్తామన్న హామీ రాష్ట్ర ప్రభుత్వం తక్షణం అమలు చేయాలని, కొన్ని నిబంధనలను సడలిస్తూ అర్హత ఉన్న ప్రతి జర్నలిస్టుకు అక్రిడేషన్ కార్డులు మంజూరు చేయాలని, జర్నలిస్టుల రక్షణ కోసం రాష్ట్ర స్థాయి మరియు దేశస్థాయిలో జర్నలిస్టు రక్షణ చట్టాన్ని రూపొందించాలని, యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ పాలసీ స్కీమ్ పునరుద్ధరించాలని, జర్నలిస్టులకు ఇళ్లస్థలాలు ఇస్తామని ప్రభుత్వం ఇచ్చిన హామీని అమలు చేయాలని, జర్నలిస్టుల కోసం సంక్షేమ నిధి ఏర్పాటు చేయాలని, రాష్ట్రంలో జర్నలిస్ట్ హెల్త్ స్కీమ్ పునరుద్ధరించాలని, రాఘవాచారి ప్రెస్ అకాడమీ కి అవసరమైన నిధులను రాష్ట్ర ప్రభుత్వం కేటాయించాలని, జర్నలిస్టులకు సంబంధించి వివిధ స్థాయిల్లో, నియామకాలు నిలిపివేసిన , కమిటీలను వెంటనే పునరుద్ధరించాలని వినతిపత్రంలో కోరారు.
ఈ కార్యక్రమంలో ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు మద్దాల రాంబాబు, జిల్లా కార్యదర్శి పెంటకోట జోగినాయుడు,జిల్లా ఎలక్ట్రానిక్ మీడియా(ఏపీ యూ.ఎమ్.జే ఏ ఉపాధ్యక్షులు ఆళ్ల వెంకట అప్పారావు, కోశాధికారి కొయిలాడ చంద్రశేఖర్,సహాయ కార్యదర్శి కాండ్రేగుల మోహన్ బాబు, మల్ల భాస్కరరావు, అజయ్ గంగాధర్, అవతారం, నానాజీ, శ్రీనివాసరావు, రమణాజీ, నటరాజ్, శశి, తదితరులు పాల్గొన్నారు.