సుస్థిర అభివ్రుద్ధిలో జిల్లా ముందుండాలి..
Ens Balu
8
Anakapalle
2022-05-10 10:55:03
అనకాపల్లి జిల్లా సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సాధనలో మొదటి స్థానంలో ఉండాలని జిల్లా కలెక్టర్ రవి పట్టన్ శెట్టి అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లో ఈ విషయమై జరిగిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆయా శాఖలకు సంబంధించి ఇచ్చిన 475 లక్ష్యాలను సాధించేందుకు అధికారులు తగిన చర్యలు తీసుకుని కృషి చేయాలన్నారు. విద్య ఆరోగ్యం పేదరిక నిర్మూలన ఉపాధి మొదలైన విషయాలలో లక్ష్యాలు సాధించేందుకు ప్రణాళికాయుతంగా చర్యలు చేపట్టాలన్నారు. ఈ సమావేశంలో ముఖ్య ప్రణాళిక అధికారి రామారావు జిల్లా వ్యవసాయ శాఖ అధికారి లీలావతి జిల్లా మత్స్యశాఖ అధికారి లక్ష్మణ్ రావు జిల్లా స్త్రీ శిశు సంక్షేమ శాఖ అధికారి సీతా మహాలక్ష్మి జిల్లా విద్యాశాఖ అధికారి లింగేశ్వర రెడ్డి పశుసంవర్ధక శాఖ గృహ నిర్మాణ మార్కెటింగ్ పరిశ్రమలు ఈపీడీసీఎల్ ఆర్డబ్ల్యూఎస్ తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.