16న మన్యంలో ఎస్టీ కమిషన్ చైర్మన్ పర్యటన


Ens Balu
5
Parvathipuram
2022-05-10 11:16:20

రాష్ట్ర ఎస్టీ కమిషన్ చైర్మన్ డాక్టర్ కుంభా రవిబాబు ఈ నెల 16వ తేదీన జిల్లాలో పర్యటనకు వస్తున్నారని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ తెలిపారు. ఈ మేరకు మంగళ వారం ఒక ప్రకటన జారీ చేశారు. 16వ తేదీ ఉదయం 10.30 గంటలకు సీతంపేట మండలం ఆడాలి గ్రామాన్ని చేరుకుంటారని చెప్పారు. ఆడాలి గ్రామంలో 12:30 గంటల వరకు స్థానిక గిరిజనులతో మాట్లాడుతారని, అనంతరం సీతంపేట చేరుకుని భోజనానంతరం మధ్యాహ్నం 2 గంటలకు ఐటిడిఏ సమావేశ మందిరంలో వివిధ గిరిజన సంఘాలతో ముఖాముఖిలో పాల్గొంటారని తెలిపారు. అనంతరం వివిధ శాఖల అధికారులతో నిర్వహించే సమావేశంలో పాల్గొంటారని ఆయన పేర్కొన్నారు. సమావేశం తరువాత శ్రీకాకుళం చేరుకుంటారని ఆ ప్రకటనలో తెలిపారు.