ఏపి సెట్‌ ‌కి అక్టోబరు 5 వరకు దరఖాస్తు గడువు..


Ens Balu
4
ఆంధ్రాయూనివర్శిటీ
2020-09-18 19:22:31

రాష్ట్రస్థాయి అర్హత పరీక్ష (ఏపిసెట్‌) ‌పరీక్షను డిసెంబరు 20వ తేదీన నిర్వహించనున్నట్లు మెంబర్‌ ‌సెక్రటరీ ఆచార్య కె.శ్రీనివాస రావు  తెలిపారు. శుక్రవారం ఆయన ఏయూలో మీడియాతో మాట్లాడుతూ, అక్టోబరు 5వ తేదీ వరకు దరఖాస్తులను స్వీకరిస్తామన్నారు. రూ వెయ్యి అపరాధ రుసుముతో అక్టోబరు 12 వరకు, రూ 2 వేలు అపరాధ రుసుముతో అక్టోబరు 21వ తేదీ వరకు, రూ 5 వేలు అపరాధ రుసుముతో నవంబరు 11వ తేదీ వరకు దరఖాస్తులను స్వీకరిస్తామన్నారు. డిసెంబరు 12వ తేదీ నుంచి హాల్‌టికెట్లను డౌన్‌లోడ్‌ ‌చేసుకోవచ్చునన్నారు. పూర్తి సమాచారం ఏపిసెట్‌ ‌వెబ్‌సైట్‌ ww.apset.net.inనుంచి పొందవచ్చునన్నారు. విద్యార్థులు సత్వరం దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఆశక్తిగల విద్యార్ధులు, దరఖాస్తు చేద్దామని మరిచిపోయిన విద్యార్ధులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు.