వైశాఖపౌర్ణమికి 2వ విడత చందన సమర్పణ


Ens Balu
14
Simhachalam
2022-05-11 09:22:41

ఉత్తరాంధ్ర ప్రజల ఆరాధ్య దైవం, భక్తకోటి ఇలవేల్పు సింహాచలం శ్రీశ్రీశ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి(సింహాద్రి అప్పన్న)కి వైశాఖ పౌర్ణమి సందర్భంగా 2వ విడత 3 మణుగుల చందనాన్ని శాస్త్రోక్తంగా సమర్పించనున్నారు.  ఏడాది పొడవునా సుగంధభరిత చందనంలో ఉండే స్వామి ఒక్క వైశాఖ శుద్ధ తదియ నాడు మాత్రమే భక్తులకి తన నిజరూప దర్శనమిస్తారు. దీనినే భక్తులంతా చందనయాత్ర గా ,చందనోత్సవంగా పిలుస్తారు. నిజరూపదర్శనం రోజు రాత్రికి 3 మణుగుల చందనాన్ని తొలివిడతగా స్వామికి సమర్పించారు. 2వ విడతగా వచ్చే వైశాఖ పౌర్ణమి నాడు మరో 3 మణుగుల చందనాన్ని సమర్పించనున్నారు. ఇందుకోసం ఆలయ సిబ్బంది ఇప్పటికే చురుగ్గా చందనము అరగతీత ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. జేష్ట పౌర్ణమికి మూడో విడతగా 3మణుగుల చందనాన్ని సమర్పిస్తారు. ఆషాడ పౌర్ణమి 4 నాలుగో విడత గా మరో 3 మణుగుల చందనాన్ని సమర్పిస్తారు. ఇక. శ్రావణ పౌర్ణమికి కరాళ చందన సమర్పణ తో మొత్తం ప్రక్రియ పూర్తి కానుంది. ఇలా ఏడాదిలో 4 విడతలుగా  పన్నెండు మణుగుల చందనాన్ని స్వామికి సమర్పించడం పూర్వ చక్రవర్తుల కాలం నుంచి ఆనవాయితీగా వస్తోంది. కాగా గుమ్మడి పండు అలంకారంలోఉన్న సింహాద్రి నాధుడు ను అప్పన్న ధర్మకర్తల మండలి సభ్యులు, జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి ,వైజాగ్ జర్నలిస్టుల ఫోరం అధ్యక్షుడు గంట్ల శ్రీనుబాబు దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. వైశాఖ పౌర్ణమి వరకూ స్వామి ఇదే అలంకరణలో భక్తులకు దర్శనమిస్తారని తెలియజేశారు.
సిఫార్సు