వాయు కాలుష్య నియంత్రణకు ప్రణాళిక


Ens Balu
8
Rajahmundry
2022-05-11 10:03:33

వాయు కాలుష్యాన్ని ఎదుర్కోవడానికి దీర్ఘకాలిక, సమయానుకూలమైన ప్రణాళికలు తయా రుచేసి సత్ఫలితాలు సాధించాలని జిల్లా కలెక్టర్ డా. కె. మాధవీలత పేర్కొన్నారు. బుధవా రం స్థానిక కలెక్టరేట్ సమావేశ మందిరంలో పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఆధ్వర్యంలో జాతీయ స్వచ్ఛమైన గాలి కార్యక్రమం (NCAP) జిల్లా సమన్వయ శాఖల అధికారులు సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ డా. కె. మాధవీలత మాట్లాడుతూ, రాజమహేంద్రవరం నగర పాలక సంస్థ, రవాణా శాఖ, వ్యవసాయ అనుబంధ రంగాలు, పరిశ్రమలు, మైనింగ్, పౌర సరఫరాలు ఇతర శాఖలు జిల్లాలో వాయు కాలుష్య నియంత్రణ పద్ధతులపై అధ్యయనం చేయ్యాలన్నరు. ఆయా శాఖ లు సమిష్టిగా పనిచేసి సమగ్ర నివేదికను రూపొందించాలన్నారు. ఆయా ప్రాజెక్ట్ వివరాలు కేంద్ర ప్రభుత్వ వెబ్ సైట్ లో అప్లోడ్ చెయ్యాల్సి ఉంటుందని, ఇందుకు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు తగిన అవగాహన కల్పిస్తారని కలెక్టర్ స్పష్టం చేశారు.  వాయు కాలుష్యము నివారించేందుకు కేంద్ర ప్రభుత్వం ఎన్. సి ఎ పి. కార్యక్రమాన్ని 2017-2024 లో అమలు చేస్తూ, అందుకోసం నిధులను విడుదల చేయడం జరిగిందన్నారు. ఇప్పటి వరకు సుమారు రాజమహేంద్రవరం నగర పాలక సంస్థ ద్వారా చేపట్టిన పనులు, పురోగతిపై కలెక్టర్ సమీక్షించారు. మరింత సమర్ధంతంగా కార్యాచరణ తయారు చేసి, అమలు చేయాల్సి ఉందన్నారు.  రాజమహేంద్రవరం నగర పాలక సంస్థ ద్వారా చేపట్టినపనుల వినిమయ ద్రువపత్రం జారీచేసి, కేంద్రానికి సమర్పించాలని మాధవీలత ఆదేశించారు. ఇంకా రెండు సంవత్సరాలు కాలవ్యవధి ఉందన్నారు. ఎన్. సి ఎ పి. కార్యక్రమానికి కేటాయించిన నిధుల్లో జిల్లాకి సంబంధించి మరో రూ.80 లక్షలు నిధులు  అందుబాటులో ఉన్నాయని, వాటిని సరైన ప్రతిపాదనలు సిద్ధం చేసి లక్ష్యాలను చేరుకోవాలన్నారు. ప్రతి రెండు నెలలకు ఒకసారి ఈ సమావేశం నిర్వహించ వలసి ఉందని, వొచ్చే సమావేశం నాటికి సమగ్ర నివేదికను సమర్పించాలన్నారు. 

పోల్యూషన్ కంట్రోల్  బోర్డు ఎక్జిక్యూటివ్ ఇంజనీర్ ఎన్. అశోక్ కుమార్ మాట్లాడుతూ, గాలిలొ కాలుష్యం 2024 నాటికి పర్టిక్యులేట్ మ్యాటర్ సాంద్రతలలో 20% నుండి 30% తగ్గింపును సాధించడం లక్ష్యంగా ఎన్. సి ఎ పి కార్యక్రమం ఏర్పాటు చేసి, అమలు చేయడం జరుగుతోందన్నారు. కనీసం పార్టిక్యులేట్ మ్యాటర్ సాంద్రతలలో 20% నుండి 30% తగ్గింపును సాధించాల్సి ఉందన్నారు. జిల్లాలో 60 ప్రదేశాల్లో పరికరాలు ఏర్పాటు చేసి అధ్యయనం చేస్తున్నట్లు పేర్కొన్నారు. నగరంలోని శ్రీ ఆనం కళా కేంద్రం లో ఒక పరికరం ఏర్పాటు చేసినట్టు తెలిపారు. గత 4 సంవత్సరాలు వివరాలు తెలుపుతూ 2018-19 లో 63 సాంద్రత, 2019-20 లో 59 ; 2020-21 లో 73, 2021-22 లో 63 గా గాలి కాలుష్యం లో పార్టిక్యులేట్ మ్యాటర్  నమోదు ఉందని, జాతీయ స్థాయి లో కనీసం 60 పాయింట్స్ కు చేరుకావాలని లక్ష్యాలను నిర్దేశించారని తెలిపారు.  ఇందుకోసం దేశంలో 122 నగరాలను గుర్తించినట్లు పేర్కొన్నారు. రాజమహేంద్రవరం లో ఇప్పటికే పలు ప్రాజెక్ట్స్ చేపట్టి వివిధ దశల్లో ఉన్నాయని తెలిపారు. ఆర్ ఏం సి అధికారులు మాట్లాడుతూ, నగరంలో సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్, వాటర్ ఫౌంటైన్ లతో ప్రాజెక్ట్ లను చేపట్టడం జరిగిందని, ఫౌంటైన్ లకు చెందిన పనులు 60 నుంచి 80 శాతం పూర్తి అయ్యాయని తెలియచేశారు. ఈ సమావేశంలో సంబందించిన శాఖల అధికారులు పాల్గొన్నారు.