శత శాతం డిజిటలైజేషన్ జరగాలి


Ens Balu
8
Srikakulam
2022-05-11 15:21:02

బ్యాంకులు సుల‌భ‌త‌ర విధానాల‌ను అనుస‌రించ‌టం ద్వారా ప్ర‌జ‌ల‌కు నాణ్య‌మైన సేవ‌లం దించాల‌ని జిల్లా కలెక్టర్ శ్రీకేష్ లాఠకర్ అన్నారు.  వివిధ ప‌థ‌కాల ద్వారా ప్ర‌యోజ‌నాలు పొందుతున్న ల‌బ్ధిదారుల‌కు మెరుగైన సేవలందించేందుకు కృషి చేయాల‌ని బ్యాంకర్లకు  విజ్ఞ‌ప్తి చేశారు. క‌లెక్ట‌రేట్ స‌మావేశ మందిరంలో బుధవారం నిర్వహించిన డీఎల్ఆర్‌సీ (డిస్ట్రిక్ట్ లెవెల్ రివ్యూ క‌మిటీ) స‌మావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ శత శాతం డిజిటలైజేషన్ ను ఆర్.బి.ఐ ఆదేశాలు ప్రకారం త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. డిజిటల్ అకౌంట్స్ ఖాతా వివరాలు బ్యాంకుల వారీగా రివ్యూ నిర్వహించి ఆరా తీశారు.  క్యూ కోడ్ లేని వారిని గుర్తించే విధంగా వాలెంటిర్ల ద్వారా సర్వే నిర్వహించేలా చర్యలు చేపట్టాలని జిల్లా పరిషత్ సి.ఇ.ఓ ను ఆదేశించారు. బ్యాంకుల వారీగా ఋణాలు మంజూరు కేటాయించిన టార్గెట్లు పై సమీక్షించి టార్గెట్లు రీచ్ అయ్యేలా ప్రణాళికలు రూపొందించుకొవాలని సూచించారు. రివ్యూ కమిటీ సమావేశానికి సంబంధించిన అధికారులు మాత్రమే హాజరు కావాలి, బ్రాంచ్ మేనేజర్ల తో బ్యాంకుల కంట్రోలర్స్  సమావేశాలు నిర్వహించి సంబంధిత మినిట్స్ లోడ్ బ్యాంక్ ద్వారా అందించేలా చర్యలు చేపట్టాలన్నారు..

జగనన్న గృహనిర్మాణ లబ్ధిదారులకు సంబంధించి మంజూరు చేసిన ఋణాల పై సమీక్షించారు, ప్ర‌భుత్వం ప్ర‌వేశ పెడుతున్న వివిధ ప‌థ‌కాల ద్వారా ఆర్థిక‌ ఫ‌లాలు త్వ‌రిత‌గ‌తిన ల‌బ్ధిదారుల‌కు అందేలా బ్యాంక‌ర్లు చ‌ర్య‌లు తీసుకోవాల‌ని కోరారు. స‌మావేశంలో భాగంగా జ‌గ‌న‌న్న తోడు, చేయూత, ఆస‌రా, బీసీ కార్పొరేష‌న్ త‌దిత‌ర‌ ప‌థ‌కాల్లో భాగంగా అందించే రుణ ప్ర‌క్రియ‌పై సుదీర్ఘంగా చ‌ర్చ జ‌రిగింది. బ్యాంకర్ల సమావేశంలో జాయింట్ కలెక్టర్ ఎం.విజయ సునీత, డి.సి. సి కన్వీనర్ బి.కె.వి.ఎస్.ఎస్.గురునాథ్ రావు, ఎల్‌.డి.ఎం. జి.వి.బి.డి.హరిప్రసాద్, నాబార్డ్ డి.డి. ఎం వరప్రసాద్, జిల్లా పరిషత్ సి.ఇ.ఓ లక్ష్మీపతి, డీఆర్‌డీఏ పీడీ శాంతిశ్రీ, మెప్మా పీడీ కిరణ్ కుమార్, వ్యవసాయ శాఖ జాయింట్ డైరెక్టర్  కె.శ్రీధర్, పశుశుసంవ‌ర్థక శాఖ ఎ.డి ఆర్.ప్రసాద రావు, లైన్ బ్యాంక్స్ డిపార్ట్మెంట్ హెడ్స్, కంట్రోలర్స్, కోఆర్డినేటర్, స్టాక్ హోల్డర్స్ డి.సి.సి అండ్ డి.ఎల్.ఆర్, వివిధ బ్యాంకుల రీజ‌న‌ల్ మేనేజ‌ర్లు, బ్రాంచి మేనేజ‌ర్లు త‌దిత‌రులు పాల్గొన్నారు. ఆర్.బి.ఐ, డి.డి.ఎం తేజాడిప్త బెహరా వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు.