విశాఖ దేవాదాయశాఖ డిసీగా సుజాత
Ens Balu
3
Visakhapatnam
2022-05-11 16:04:22
దేవదాయ ధర్మాదాయశాఖ విశాఖపట్నం ఉప కమిషనర్ గా వి.సుజాతను నియమిస్తూ ఆ శాఖ కమిషనర్ బుధవారం ఆదేశాలు జారీ చేశారు. ఇంతవరకూ ఇక్కడ డిప్యూటీ కమిషనర్ గా పనిచేస్తున్న వి.శ్రీనివాసరెడ్డిని నెల్లూరులోని రాజరాజేశ్వరి దేవస్థానం ఈఓ గానే కొనసాగాలని ఆ ఆదేశాల్లో పేర్కొన్నారు. సుజాత గతంలో విశాఖపట్నంలో డిప్యూటీ కమిషనర్ పనిచేసేవారు. ప్రస్తుతం సింహాచలం దేవస్థానంలో పని చేస్తున్నారు. డిప్యూటి కమిషనర్ గా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగిస్తూ కమీషనర్ ఆదేశాలు జారీ చేశారు. అనకాపల్లి జిల్లా సహాయ కమిషనర్ గా విశాఖపట్నం జిల్లా దేవాదాయ శాఖ సహాయ కమిషనర్ కార్యాలయంలో సూపరింటెండెంట్ గా పనిచేస్తున్న రాజారావు నియమిస్తూ ఆదేశాలు జారీ చేసినట్లు తెలిసింది. ఇంతవరకు అనకాపల్లి జిల్లా సహాయ కమిషనర్ గా విశాఖపట్నం జిల్లా సహాయ కమిషనర్ కె.శాంతి కొనసాగుతూ వచ్చారు. ప్రస్తుతం శాంతి సహాయ కమిషనర్ పోస్టుతో పాటు ఎర్నిమాంబ ఆలయ ఈఓగాను కనకమహాలక్ష్మి దేవస్థానం ఈఓగాను కొనసాగుతున్నారు.