అమ్మగా ఆలన..అధికారిణిగా పాలన..!
Ens Balu
2
జివిఎంసి
2020-09-18 19:45:23
ముద్దులొలికే ఆ బాబుకి అమ్మగా ఆలన చూస్తూనే...అధికారిణిగా పాలన కూడా చేస్తున్నారు మహావిశాఖ నగరపాలక సంస్థ కమిషనర్ డా.స్రిజన... అమ్మతనానికి, అధికారి పాలన ఎలాంటి అడ్డూ ఉండదని రుజువు చేస్తున్నారు... అధికారిక కార్యక్రమాలకు కూడా తన బాబుని తీసుకువచ్చి బాబుకి తల్లిదూరమైన లోటుని తగ్గించే ప్రయత్నం చేస్తున్నారు. ఐఏఎస్ అధికారిణి అంటే మామూలు విషయం కాదు ఎన్నో పనులు, మరెన్నో ఒత్తిడిలు వాటన్నింటినీ దైర్యంగా ఎదుర్కొంటూనే కరోనా సమయంలో తన బాబుని జాగ్రత్తగా చూసుకుంటూనే, అధికారిక కార్యక్రమాలకు ఎలాంటి డోకా లేకుండా ముందుకి సాగిపోవడం ఈ ఐఏఎస్ అధికారిణికి అలవాటుగా మారిపోయింది. ఐఏఎస్ అధికారిణి అంటే..చుట్టూ పదిమంది అధికారులు..బంట్రోతులు..పరిపాలన సిబ్బంది...ఎలా చూసుకున్నా చిటికేస్తే ఏ పనైనా చేయాల్సిందే...కానీ అవేమీ తన సొంత అవసరాలకు వినియోగించుకోరు ఆమె...కేవలం కార్యాలయ పనులకు మాత్రమే అధికారులను సిబ్బందిని వినియోగిస్తూ, సొంతపనులు తానే స్వయంగా చేసుకుంటూ ముద్దులొలికే బాబుని మరింత అపురూపంగా చూసుకుంటున్న ఈ ఐఏఎస్ అధికారిణి తీరు ఎందరికో ఆదర్శంగా నిలుస్తుంది. అలాంటి సన్నివేశం శుక్రవారం జివిఎంసీ ప్రధాన కార్యాలయంలో ఈఎన్ఎస్ కంటపడింది. చూసింది చూసినట్టు...అక్షరాక్షరం ఏరి కోరి అమ్మకి వందనం చేస్తూ...అధికారిణికి నమస్కరిస్తూ ఎంతగానో ఆలోచింపజేసేలా రాసిన వార్తే ఇది...