త్రాగునీటి సమస్యకు 2రోజుల్లో పరిష్కారం


Ens Balu
8
Anantapur
2022-05-16 07:59:41

గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ప్రజలు తీసుకువచ్చిన త్రాగునీటి సమస్యకు రెండు రోజుల్లో పరిష్కారం చూపి తమది ప్రజా ప్రభుత్వం అని మరోసారి చాటామని నగర మేయర్ మహమ్మద్ వసీం పేర్కొన్నారు.  అనంతపురం నగరంలోని 9వ డివిజన్ పరిధిలోని భవాని నగర్ పైప్ లైన్ రోడ్ లో నీటి సమస్య అధికంగా ఉందని రెండు రోజుల క్రితం జరిగిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో స్థానికులు అర్బన్ ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి గారి  దృష్టికి స్థానికులు తీసుకెళ్లారు.దీనిపై స్పందించిన ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి గారు సమస్యను వెంటనే  పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.దీనితో అధికారులు ఆ ప్రాంతంలో పర్యటించగా డివిజన్ పరిధిలోని నాలుగు వీధులు మిట్ట ప్రాంతంలో ఉండటంతో నీటి సరఫరా జగగడం లేదని గుర్తించారు. వెంటనే సరఫరా జరిగే విదంగా ప్రత్యేకంగా గేట్ వాల్వ్ ను యుద్ధ ప్రాతిపదికన ఏర్పాటు చేయడంతో సోమవారం ఆయా ప్రాంతాలకు నీటి సరఫరా జరగడంతో మేయర్ మహమ్మద్ వసీం గారు ఆ ప్రాంతంలో పర్యటించగా రెండు రోజుల్లో సమస్య పరిష్కరించడం పట్ల స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మేయర్ వసీం మాట్లాడుతూ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లడంతో పాటు స్థానిక సమస్యలను అడిగి తెలుసుకుని వాటిని పరిష్కరించాలన్న లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా చేపడుతోందన్నారు.కార్యక్రమంలో ప్రజలు తమ దృష్టికి తీసుకువస్తున్న సమస్యలను వీలయినంత త్వరగా పరిష్కరించడం జరుగుతుందన్నారు.అందులో భాగంగానే ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి గారి ఆదేశం మేరకు భవాని నగర్ పైప్ లైన్ రోడ్ లో నీటి సమస్య పరిష్కరించామన్నారు.ప్రజలు కూడా నీటిని వృధాచేయకుండా  కుళాయిలకు మూతలు ఏర్పాటు చేసుకోవాలని మేయర్ సూచించారు.కార్యక్రమంలో డిఈ చంద్రశేఖర్, కార్పొరేటర్ కమల్ భూషణ్,నాయకులు గంగాధర్ తోపాటు అధికారులు పాల్గొన్నారు.