పుస్తక పఠనం తో విజ్ఞానాన్ని పెంపొందించుకోవాలని జిల్లా గ్రంధాలయ సంస్థ ఛైర్పర్సన్ సువ్వారి సువర్ణ అన్నారు. మంగళవారం శ్రీకాకుళం జిల్లాలో కేంద్ర గ్రంథాలయంలో వేసవి విజ్ఞాన శిబిర కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఛైర్పర్సన్ మాట్లాడుతూ విద్యార్ధులకు ఇస్తున్న ఈ సుదీర్ఘ వేసవి విరామాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఆంధ్రప్రదేశ్ పౌర గ్రంథాలయ శాఖ, వారి ఆధీనంలో ఉన్న అన్ని గ్రంథాలయాలలో పాఠశాల విద్యార్థులకు వేసవి విజ్ఞాన శిబిరాలు ఈ రోజు నుండి జూన్ 30వ తేదీ వరకు వివిధ కార్యక్రమాలు జరుగుతాయని తెలిపారు. ఈ వేసవి శిబిరంలో కధలు వినుట, చెప్పడం, పుస్తక పఠనము, పుస్తక సమీక్షలు, పెద్దల నుంచి విన్న అముద్రిత కథలు చెప్పుట, చిత్రలేఖనము, పేపర్ ఆర్ట్, థియేటర్ ఆర్ట్ వంటి సృజనాత్మక కార్యక్రమాలు ప్రతి రోజూ ఉదయం 8.00 గం॥ నుంచి మధ్యాహ్నం 12.00 గం॥ల వరకూ నిర్వహించడం జరుగుతుందన్నారు. కావున విద్యార్థులు ఈ వేసవి శిబిరాలకు హాజరై సృజనాత్మకతను పెంచుకొనేలా ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు విద్యార్థులను ప్రోత్సహించవలసినదిగా కోరారు. అలాగే గ్రంథాలయాల్లో త్రాగునీరు మౌలిక వసతులు కల్పించడం జరిగిందని వివరింరు. తల్లిదండ్రులు పిల్లలను గ్రంధాలయాలకు పంపినప్పుడు దగ్గరుండి తీసుకురావాలని తీసుకు వెళ్లాలని కోరారు.
జిల్లా విద్యాశాఖాధికారి జి.పగడాలమ్మ మాట్లాడుతూ ఆటలతో, పాటలతో పాటు రీడింగ్ అవసరమని, ప్రతి విద్యార్థికి పుస్తక పఠనం మంచి లక్షణమని వేసవి సెలవుల్లో సబ్జెక్ట్ తో పాటు మీకు వివిధ రకాల పుస్తకాలు చదవడం అలవాటు చేసుకోవాలని అన్నారు. వివిధ రకాల పుస్తకాలు చదవడంతో లోక జ్ఞానం వస్తుందన్నారు. ఎండలు తీవ్రంగా ఉన్నాయి ఇటువంటి సమయంలో మీరు బైట తిరగకుండా పుస్తకాలు చదవాలనే దృక్పథంతో ఈ శిబిరాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసిందని దీనిని ప్రతి ఒక్కరూ వినియోగించు కావాలన్నారు. ఈ కార్యక్రమంలో గ్రంధాలయ కార్యదర్శి కుమార్ రాజా, ప్రత్యేక అతిధి సువ్వరి సత్యనారయణ, ఉప గ్రంధాలయ అధికారి తిరుమల కుమారి, గ్రంధాలయాధికారి ఎస్.వి.రమణమూర్తి, జి.గోవిందా రావు, పిల్లలు వారి తల్లదండ్రులు పాల్గొన్నారు.