జిల్లా కలెక్టర్ ను కలిసిన అడిషనల్ ఎస్పీ
Ens Balu
9
Kakinada
2022-05-17 16:29:31
కాకినాడ జిల్లా కృతికా శుక్లాను జిల్లా అదనపు ఎస్పీ (అడ్మిన్) పి. శ్రీనివాస్ మంగళవారం కలెక్టరేట్లో మర్యాద పూర్వకంగా కలిశారు. ఈయన ఇటీవలే ఏఎస్పీ(అడ్మిన్) గా విధుల్లోకి చేరారు. ఈ మేరకు జిల్లాలోని ముఖ్య అధికారులను మర్యాదపూర్వకంగా కలిసి పరిచియం చేసుకుంటున్నారు. జిల్లా పోలీసు కార్యాలయంలో జిల్లా ఎస్పీ తరువాత పరిపాలన విభాగంలో అడిషనల్ ఎస్పీ అడ్మిన్ కీలకంగా వ్యవహరిస్తారు. జిల్లా ఎస్పీ లేని సమయంలో కూడా ప్రభుత్వం ఏస్పీలకే అదనపు బాధ్యతలు కూడా అప్పగిస్తుంది. ఈ తరుణంలో జిల్లాపై పూర్తిస్థాలోయిలో ఏఎస్పీలకు అవగాహన ఉంటుంది. ఈ నేపథ్యంలోనే జిల్లా అడిషనల్ ఎస్పీలుగా విధుల్లో చేరిన వారు జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్, జిల్లా మంత్రులు, ఎంపీలు ఇలా ప్రముఖలందరినీ కలిసి పరిచేసుకుంటున్నారు. నూతనంగా విధుల్లోకి చేరిన ఏఎస్పీ అడ్మిన్ పి.శ్రీనివాస్ కు ముక్కుసూటి అధికారిగా కూడా మంచి పేరుంది.