మిషన్ నిర్మాణ్ ను వినియోగించుకోండి..
Ens Balu
4
Vizianagaram
2022-05-18 12:56:03
మిషన్ నిర్మాణ్ - 2022 పేరిట ఐదు రోజుల పాటు స్థానిక ఆనందగజపతి ఆడిటోరియంలో వివిధ అంశాలపై నిపుణుల చేత ప్రత్యేక శిక్షణా కార్యక్రమాలు ఉంటాయని జిల్లా కలెక్టర్ ఎ. సూర్యకుమారి పేర్కొన్నారు. విద్యార్థులకు ఇదొక సువర్ణావకాశమని అందరూ సద్వినియోగం చేసుకోవాలని బుధవారం ఓ ప్రకటన ద్వారా సూచించారు. సమగ్ర శిక్షా అభియాన్ పర్యవేణలో కేంబ్రిడ్జ్ అసెస్‌మెంట్ ఇంగ్లీషు, 21 సెంచరీ ఎడ్యుకేషనల్ సొసైటీ, ఏసీఈ సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో ఈ నెల 19 నుంచి 23వ తేదీ వరకు ఐదు రోజుల పాటు శిక్షణా కార్యక్రమాలు జరుగుతాయని వివరించారు. కెరియర్ గైడెన్స్, కమ్యూనికేషన్ స్కిల్స్ పై ప్రత్యేక వర్క్ షాప్‌లు ఉంటాయని వెల్లడించారు. ప్రతి రోజూ ఉదయం 10.00 నుంచి సాయంత్రం 5.00 గంటల వరకు కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయం సర్టిఫై చేసిన శిక్షకులతో ప్రత్యేక శిక్షణా కార్యక్రమాలు ఉంటాయని పేర్కొన్నారు. 10వ తరగతి నుంచి ఇంజనీరింగ్ వరకు చదివే విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొనవచ్చని ఆసక్తి కలిగిన వారు వివరాలను ఆన్లైన్ లో నమోదు చేసుకోవాలని సూచించారు. ఇతర వివరాలకు 90002 04925, 90002 01525 నెంబర్లను సంప్రదించవ్చని చెప్పారు. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు పూర్తయినట్లు సమగ్ర శిక్షా అభియాన్ పీవో స్వామినాయుడు తెలిపారు.