ఇక డా.భీఆర్.అంబేత్కర్ కోనసీమ జిల్లా


Ens Balu
5
కోనసీమ
2022-05-18 13:24:00

కోనసీమ జిల్లా ఇక డా.బీఆర్. అంభేత్కర్ జిల్లాగా పేరు మారనుంది. ఆ జిల్లా పేరును డా.బీఆర్‌.అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాగా మార్చాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనిపై ఇప్పటికే ప్రాధమిక నోటిఫికేషన్ విడుదల చేసింది. అమలాపురం కేంద్రంగా ఏర్పాటు చేసిన కోనసీమ జిల్లాకు డా.బీఆర్‌.అంబేడ్కర్‌ పేరు పెట్టాలని దళిత, ప్రజాసంఘాలు, వివిధ పార్టీలు ప్రభుత్వాన్ని తీవ్రస్థాయిలో కోరాయి. దీనికోసం పలుచోట్ల ఆందోళన కార్యక్రమాలు కూడా చేపట్టారు. ఈ నేపథ్యంలో కోనసీమ జిల్లా పేరులో డా.బీఆర్‌.అంబేడ్కర్‌ పేరును చేరుస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనితో ఈ ప్రాంతీయుల చిరకాల కోరిక తీరినట్టు అయ్యింది..