టిఎంఎఫ్ ప్రాజెక్ట్ లో ఉద్యోగ అవకాశాలు..


Ens Balu
9
Paderu
2022-05-18 13:28:21

అల్లూరి సీతారామరాజు పాడేరుజిల్లాలో పాఠశాల పారిశుద్ధ్య కార్యక్రమం అమలు చేసేందుకు ప్రాజెక్ట్ మానిటరింగ్ యూనిట్ ఏర్పాటు చేసిటన్టు జిల్లా విద్యాశాఖ అధికారి డా. పి రమేష్ తెలిపారు. పిఎంయు లో అవుట్సోర్సింగ్ విధానంలో పనిచేయుటకు ఒక ప్రాజెక్ట్ కో-ఆర్డినేటర్, ఒక డాటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టుల భర్తీకి జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ఆదేశించినందున ఆసక్తి, అర్హతలు గల అభ్యర్థులు ఈనెల 25వ తేదీలోగా నేరుగా గాని పోస్ట్ ద్వారా గాని దరఖాస్తు చేసుకోవాలని డీఈఓ ఒక ప్రకటనలో తెలిపారు.  పథక సమన్వయకర్త (ప్రాజెక్ట్ కో-ఆర్డినేటర్)  పోస్టుకు దరఖాస్తు చేయదలచిన వారు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి డిగ్రీ లేదా పోస్ట్ గ్రాడ్యుయేషన్ అర్హత కలిగి ఉండి పాఠశాల లేదా ఇంటర్మీడియట్ విద్యాశాఖలో సహాయ సంచాలకులు లేదా పర్యవేక్షకులు లేదా ప్రధానోపాధ్యాయులుగా పని చేసి పదవీ విరమణ పొందిన వారు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని, వారికి నెలకు ఇరవై ఐదు వేల రూపాయలు గౌరవ వేతనం చెల్లిస్తామన్నారు. అదేవిధంగా డాటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టుకు దరఖాస్తు చేయదలచిన వారు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి కంప్యూటర్ సైన్స్ లో డిగ్రీ మరియు ఎంఎస్ ఆఫీస్ నందు,  తెలుగు ఇంగ్లీష్ టైపింగ్ లో నైపుణ్యం కలిగి ఉండాలని, వారికి నెలకు 18500 రూపాయలు గౌరవ వేతనం చెల్లిస్తామన్నారు.  జిల్లా విద్యాశాఖ లో పనిచేయుచున్న సహాయ సంచాలకులు, ఉప విద్యాశాఖ అధికారులతో ఏర్పాటు చేసిన సబ్ కమిటీ దరఖాస్తులను ఎంపిక చేసి జిల్లా మాన్ పవర్, ఔట్సోర్సింగ్ కమిటీకి పంపి, కమిటీ ఆమోదంతో అవుట్ సోర్సింగ్ విధానం లో  నియామకం జరుగుతుందని డిఇఓ తెలిపారు. ఆసక్తిగల అభ్యర్థులు పాస్ పోర్ట్ సైజు ఫోటో అతికించి, సంబంధిత ధ్రువ పత్రాలు జతపరచి పూర్తి వివరాలతో దరఖాస్తును ఈనెల 25వ తేదీలోగా జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో నేరుగా గాని పోస్టు ద్వారా గాని సమర్పించాలని సూచించారు. ఇతర వివరాలు, సందేహ నివృత్తి కోసం కార్యాలయ పని వేళల్లో 8309994622 లేదా 9441328097 నంబర్లలో సంప్రదించవచ్చని తెలిపారు.