ఆధ్యాత్మిక చింతన అలవరుచుకోవాలి


Ens Balu
5
Rajahmundry
2022-05-18 13:40:25

ప్రజా జీవితంలో ప్రజా ప్రతినిధులు సామాజిక సేవతో పాటు ఆధ్యాత్మిక చింతన కూడా అలవర్చుకోవాలని శ్రీ శ్రీ శ్రీ శ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్న జీయర్ స్వామి పేర్కొన్నారు. బుధవారం స్థానిక కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చిన చిన్న జీయర్ స్వామి వారిని గోదావరి నదీ తీరాన గల శ్రీ వేంకటేశ్వరస్వామి దేవస్థానంలో మంత్రి  చెల్లుబోయిన శ్రీనివాస వేణు గోపాల కృష్ణ, తదితరులు మర్యాద పూర్వకంగా కలిసి ఆయన ఆశీర్వాదం తీసుకున్నారు. మంత్రి వెంట రాజా నగరం శాసన సభ్యులు జక్కంపూడి రాజా, స్థానిక నాయకులు కర్రీ పాపా రాయుడు, ఆకులవీర్రాజు తదితరులు ఉన్నారు.