ఉన్నత చదువులకి ఇంగ్లీషు తప్పనిసరి


Ens Balu
11
Srikakulam
2022-05-18 15:01:11

వేసవి విజ్ఞాన శిబిరం లో భాగంగా రెండవ రోజు బుధవారం జిల్లా కేంద్ర గ్రంథాలయంలో నిర్వహించారు, కార్యదర్శి కె.కుమార్ రాజ మాట్లాడుతూ ప్రతి విద్యార్థి ఇంగ్లీష్ ను ప్రాథమిక స్థాయి నుంచే  నేర్చుకోవాలన్నారు. విద్యార్థి దశ నుంచే ఇంగ్లీషు భాషలో మాట్లాడడం వ్రాయుటము వంటివి చేయాలన్నారు. విద్యార్థులతో జాతీయ నాయకుల పుస్తకాలను చదివించారు. కొంతమంది విద్యార్థులు తమకు తెలిసిన కథలను చెప్పారు. మరికొంత మంది విద్యార్థులు దేశభక్తి గేయాలు పాటల రూపంలో పాడారు. 60 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో లో డిప్యూటీ లైబ్రేరియన్ జి.తిరుమల కుమారి, గ్రంథాలయ సిబ్బంది చిరంజీవులు, యోగానంద్, పి.ఈశ్వరరావు, టి.రాంబాబు, పి.రామమోహన్, పి.భానుమతి, ప్రత్యూష, గణేష్ తదితరులు పాల్గోన్నారు.